Saturday, May 18, 2024
- Advertisment -
HomeLatest NewsPrithvi Shaw | సెల్ఫీలకు నిరాకరించాడని భారత క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి.. బేస్‌బాల్‌ బ్యాట్‌తో...

Prithvi Shaw | సెల్ఫీలకు నిరాకరించాడని భారత క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి.. బేస్‌బాల్‌ బ్యాట్‌తో కారు అద్దాలు ధ్వంసం

Prithvi Shaw | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: టాలెంటెడ్‌ క్రికెటర్‌ పృథ్వీ షా మరోమారు ఆటేతర అంశాలతో వార్తల్లో నిలిచాడు. అభిమానులతో అతడు గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఘటనలో 8 మందిపై కేసు రిజిస్టర్‌ చేశారు. సెల్ఫీలు దిగేందుకు పృథ్వీ నిరాకరించడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్‌ కారు పై బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించగా.. పృథ్వీ వారిని అడ్డుకుంటున్నట్లు వీడియోల్లో రికాౖర్డెంది.

ముంబైలోని శాంతాక్రూజ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న పృథ్వీ షా.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైనా.. అతడికి తుది జట్టులో అవకాశం దక్కని విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ ఆడుతుండగా.. పృథ్వీ షా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దేశవాళీల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పృథ్వీ షా.. తన టీమ్‌ను ఫైనల్‌కు చేర్చలేకపోయాడు.

అసలేం జరిగిందంటే..!

పృథ్వీ తన స్నేహితుడితో కలిసి బుధవారం శాంతాక్రూజ్‌లోని ఓ స్టార్‌ హోటల్లో విందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న యువకులు పృథ్వీతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అభిమానుల అడగడంతో కాదనలేకపోయిన షా.. వారితో సెల్ఫీలు దిగాడు. అయితే వాళ్లు మరీ విసిగిస్తూ.. వేర్వేరు యాంగిల్స్‌లో సెల్ఫీలు కావాలంటూ అడిగి పృథ్వీని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇదంతా గమనించిన హోటల్‌ సిబ్బంది కలుగజేసుకొని అభిమానులకు నచ్చజెప్పి అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. అయితే అక్కడి నుంచి వెళ్లినట్లే వెళ్లిన ఆ యువకులు పార్కింగ్‌ ప్లేసులో పృథ్వీ షా కోసం కాపుకాశారు.

కాసేపటికి పార్టీ ముగించుకొని కారు వద్దకు చేరుకున్న పృథ్వీ అతడి స్నేహితుడిని ఉద్దేశించి పరుశ పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా దాడికి యత్నించారు. బేస్‌బాల్‌ బ్యాట్‌తో కారు అద్ధాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో పృథ్వీ స్నేహితుడితో కలిసి కారులో ఉండగా.. వారిని ఆపేందుకు బయటకు వచ్చాడు. దీంతో ఆ సమూహంలోని ఓ అమ్మాయి (సనా గిల్‌) పృథ్వీ పై కూడా దాడికి యత్నించింది. బేస్‌బాల్‌ బ్యాట్‌తో కారుతో పాటు పృథ్వీని కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. అతడు అడ్డుకున్నాడు. డబ్బు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసు పెడతామని పృథ్వీని ఇబ్బంది పెట్టింది. ఈ అంశంపై పృథ్వీ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్‌ చేసినట్లు వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News