Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsHCA | హెచ్‌సీఏలో ప్రతిష్ఠంభనకు తెరపడేనా.. ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

HCA | హెచ్‌సీఏలో ప్రతిష్ఠంభనకు తెరపడేనా.. ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

HCA | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో పేలవ ప్రదర్శనతో నానాటికి తీసికట్టులా మారుతున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది. హెచ్‌సీఏ పాలకవర్గ సభ్యుల పదవీ కాలం గత సెప్టెంబర్‌తో ముగిసినా.. పదవుల్లోనే కొనసాగుతున్న సభ్యులు హెచ్‌సీఏ ప్రతిష్ఠను మంటగలుపుతుండటంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకుంది. హైకోర్టు తీర్పుపై కొన్ని క్లబ్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న నలుగురు సభ్యుల సూపర్‌వైజరీ కమిటీని రద్దు చేస్తూ ఎన్నికల పర్యవేక్షకుడిగానూ జస్టిస్‌ లావు నాగేశ్వరరావునే నియమిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో మరికొన్ని రోజుల్లో హెచ్‌సీఏకు ఎన్నికలు జగరడం ఖాయంగానే కనిపిస్తోంది.

అసలు వివాదమిది..

అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ నగరంలోని కొన్ని క్రికెట్‌ క్లబ్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సంజయ్‌ కిషన్‌ కౌల్‌, మనోజ్‌ మిశ్రా, అరవింద్‌ కుమార్‌తో కూడిన బెంచ్‌ హెచ్‌సీఏలో నెలకొన్న ప్రతిష్ఠంభను తొలిగించే రీతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పు ఇచ్చింది. ఇందుకుగాను సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి తోడు హెచ్‌సీఏ ఎన్నికల పర్యవేక్షకుడిగాను ప్రకటించింది.

ఆయనకు అన్ని విధాలుగా సహకరించాలంటూ హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై బెంచ్‌ సభ్యులు మాట్లాడుతూ ‘హెచ్‌సీఏలో ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితులకు వీలైనంత తొందరలో తెరపడాలి. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. సుదీర్ఘ అనుభవమున్న హైదరాబాద్‌ వాసి అయిన రిటైర్డ్‌ సుప్రీం జడ్జీ జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పూర్తి న్యాయం చేయగలరని భావిస్తున్నాం. అందుకే ఆయనను ఏకైక సభ్యుడిగా కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలకు పర్యవేక్షకుడిగా నియమించాం. ఆయనకు అన్ని విధాలుగా హెచ్‌సీఏ సహకరించాలి. పూర్తి ఖర్చులు అసోసియేషన్‌ భరించాలి’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే వీలైనంత తొందరగా హెచ్‌సీఏకు ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు బెంచ్‌ సూచించింది.

సూపర్‌వైజరీ కమిటీ రద్దు

హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం ముగియడంతో.. పర్యవేక్షణ కోసం రైటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్‌ కక్రూ నేతృత్వంలో ఏర్పాటైన సూపర్‌ వైజరీ కమిటీని సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది. ఆ కమిటీ ఇక మనుగడలో కొనసాగదని సీనియర్‌ అడ్వకేట్‌ జయంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జస్టిస్‌ కక్రూతో పాటు అంజనీకుమార్‌, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్‌తో కూడిన సూపర్‌ వైజరీ కమిటీ రద్దు అయ్యింది. మరోవైపు అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ వద్ద ఉన్న చెక్‌పవర్‌, సైనింగ్‌ పవర్‌ను జస్టిస్‌ నాగేశ్వర్‌రావుకు బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News