Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsJasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Jasprit Bumrah | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ప్రస్తుతం భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. 2023 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ ఆడుతాడని అంతా ఊహించగా.. పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్-16వ సీజన్ వరకైనా అతడు అందుబాటులోకి వస్తాడనుకుంటున్న అభిమానులకు బీసీసీఐ అధికారి షాకింగ్ వార్త చెప్పారు. గాయం కారణంగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ కు దూరమైన బుమ్రా.. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. అయితే జాతీయ జట్టు తరఫున ఆడకున్నా.. ఐపీఎల్ వరకు అతడు అందుబాటులో ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ వరకు బుమ్రా వంద శాతం కోలుకునే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నది.

‘మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు బుమ్రా అందుబాటులో ఉండడు. అతడు పునరాగమనం చేసేందుకు మరో ఆరు నెలలు పడుతుంది. అప్పటికి కూడా అతడు తప్పక జట్టులోకి వస్తాడని చెప్పలేం. ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అతడు తిరిగి వస్తాడని ఆశిద్దాం. అప్పటికి కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటా లేదా అనేది కూడా ఇప్పుడే చెప్పలేం’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమే..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా ఇండోర్ టెస్టులో విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించనుంది. జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరుగనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడటం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ పిచ్‌లపై బుమ్రా సత్తాచాటుతాడని అనుకుంటే.. ఈ వార్తతో అతడు మెగా మ్యాచ్‌కు కూడా దూరం కావడం ఖయమే అని స్పష్టమైంది. 29 ఏండ్ల బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు ఏస్ పేసర్‌గా కొనసాగుతున్నాడు. గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకుంటే.. ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్తో కలిసి అతడు ఐపీఎల్ అదరగొడతాడనుకుంటే.. అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఇటీవలి కాలంలో గాయాలతో సహవాసం చేస్తున్న బుమ్రా.. గతేడాది భారత జట్టు తరఫున 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. బిజీ షెడ్యూల్‌తో భారత జట్టు ఎడతెరిపి లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నా.. పనిభారం కారణంగా అప్రధాన మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిస్తూ వచ్చారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News