Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsMI vs DC | తిరుగులేని హర్మన్‌ బృందం.. డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం

MI vs DC | తిరుగులేని హర్మన్‌ బృందం.. డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం

MI vs DC | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జోరు కొనసాగుతోంది. ఐపీఎల్లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ను తలపిస్తూ.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని ముంబై.. డబ్ల్యూపీఎల్‌లో చెలరేగిపోతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై.. లీగ్‌లో వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో ఢిల్లీకి ఇదే తొలి పరాజయం. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (43), జెమీమా రోడ్రిగ్స్‌ (25), రాధ యాదవ్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. లేడీ సెహ్వాగ్‌ షఫాలీ వర్మ (2) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరగా.. కాప్సీ (6), మరినే కాప్‌ (2), జెస్‌ జాన్సన్‌ (2), తానియా భాటియా (4), మిన్ను మణి (0) డగౌట్‌కు క్యూ కట్టారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖ్‌, వాంగ్‌, హీలీ మాథ్యూస్‌ తలా మూడు వికెట్లు పడగొట్టారు.

ఆడుతూ పాడుతూ..

అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ముంబై 15 ఓవర్లలో 2 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తిక భాటియా (41; 8 ఫోర్లు), హీలీ మాథ్యూస్‌ (32; 6 ఫోర్లు) దంచికొట్టగా.. స్కీవర్‌ (23 నాటౌట్‌), హర్మన్‌ (11 నాటౌట్‌) మిగిలిన పని పూర్తి చేశారు. సైకా ఇషాఖ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 6 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఢిల్లీ మూడింట రెండు నెగ్గి ఓ పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ చెరో మ్యాచ్‌లో నెగ్గి వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఇక స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు లీగ్‌లో ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌లో ఒక్కో జట్టు.. ప్రత్యర్థితో రెండీసి సార్లు తలపడనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించనుంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో యూపీ వారియర్స్‌ తలపడనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News