Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsAPTTD | సోషల్‌ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్‌ షాట్స్‌.. మండిపడుతున్న భక్తులు

TTD | సోషల్‌ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్‌ షాట్స్‌.. మండిపడుతున్న భక్తులు

TTD | ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి ఉండదు. అందుకే విమానాలను కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంపై నుంచి ఎగరడం నిషేధించారు. అంత పవిత్రంగా చూసుకుంటున్న శ్రీవారి ఆలయం ఏరియల్‌ వ్యూను పలువురు డ్రోన్లతో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సాయంత్రం వైరల్‌గా మారింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఏరియల్‌ వ్యూను డ్రోన్లతో చిత్రీకరించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.

ఐకాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియో అప్‌లోడ్‌ అయ్యింది. ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తమ దృష్టికి రాగానే టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డ్రోన్‌ షాట్స్‌ తీసినట్టు గుర్తించారు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి డ్రోన్‌ షాట్స్‌ వీడియో నిజమైందా? కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని వీజీవీ బాలి రెడ్డి తెలిపారు. ఇవి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారా? లేదా గూగుల్‌ నుంచి సేకరించారా అనే విషయాన్ని ఫొరెన్సిక్‌కు పంపించి నిర్ధారిస్తామని టీటీడీ సీవీఎస్‌ఓ నరసింహ కిశోర్‌ వెల్లడించారు.

కాగా నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం సమీపంలో డ్రోన్ కెమెరాలను వినియోగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్‌తో ఆలయం షాట్స్‌ తీసిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు గుర్తించకపోవడాన్ని భద్రతా వైఫల్యమని మండిపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News