Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తున్న సమయంలో హమ్మాద్‌పూర్ ఝల్ , రూర్కీ సమీపంలో రిషబ్ ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారు విండో పగులకొట్టుకుని రిషబ్ పంత్ బయటపడ్డారు. ఈ క్రమంలో రిషబ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతన్ని రిషికేశ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతం డెహ్రూడూన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం రిషబ్ సేఫ్‌గానే ఉన్నాడని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బీఎండబ్ల్యూ కారును పంత్ స్వయంగా నడుపుతున్నట్టు తెలిసింది.

ఇటీవల ధోని ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో రిషబ్ పంత్ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు. అక్కడి నుంచి తన స్వగ్రామం రూర్కీకి తిరిగొచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More Articles |
Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..
TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు