kodali nani comments on BRS | తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన BRS పార్టీతో పాటు ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ( kodali nani ) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ( Andhra pradesh )లో బీఆర్‌ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. హైదరాబాద్ నుంచి తమను వెనక్కి పంపారన్న భావన వారిలో ఉందన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ అంతా కేసీఆర్‌కు అనుకూలంగా మారారని, ఏపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంత వరకు ఉంటుందో చెప్పలేం అని నాని అన్నారు. కేసీఆర్‌కు ఏపీలో అభ్యర్థులు దొరుకుతారో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. చంద్రబాబు కూడా తెలంగాణలో పోటీ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించారు.
అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తొలిసారి మాట్లాడారు. ఇప్పుడు పేరు మార్నినందుకు నిరాహార దీక్షలు చేస్తున్నవారందరూ.. ఎన్టీఆర్ రక్త మాంసాలతో రాజకీయాలు చేసిన వారిని తరిమికొట్టాలని కోరుతూ నిరాహార దీక్షలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?