Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHealthWHO alert | ప్రపంచానికి వైరస్‌ల ముప్పు తొలగిపోలేదు.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రపంచ ఆరోగ్య...

WHO alert | ప్రపంచానికి వైరస్‌ల ముప్పు తొలగిపోలేదు.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

WHO alert | ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ల ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) కొవిడ్ 19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్‌ కేర్కోవ్ హెచ్చరించారు. కొవిడ్‌ 19 ( Covid 19 ) , ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ ( శ్వాసకోశ వ్యాధిని కలిగించే వైరస్‌)లతో పాటు అనేక వైరస్‌లు అత్యంత వేగంగా గాలిలో వ్యాపిస్తున్నాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా ప్రభావం తొలగిపోయిందని ప్రపంచదేశాలు ఆంక్షలు ఎత్తేశాయి. మాస్కులు, భౌతిక దూరాన్ని వదిలేశాయి. అయితే ప్రపంచానికి వైరస్‌ల ముప్పు ఇంకా తొలగిపోలేదని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని వాన్‌ కేర్కోవ్‌ హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైరస్‌ల కట్టడిపై ప్రపంచ దేశాలు అలసత్వం వహిస్తున్నాయని, అది మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్‌ల నుంచి మీ ఆత్మీయులను కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని వాన్ కేర్కోవ్‌ పిలుపునిచ్చారు. మాస్కులు ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే అలస్యం చేయొద్దని సూచించారు. అవసరమైతే ఇంట్లోనే రాపిడ్‌ టెస్టులు చేసుకోవాలని, ఇంటిదగ్గరే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి తగ్గపోలేదని హెచ్చరించారు.

ఒమైక్రాన్‌కు ( Omicron ) సంబంధించిన 500 సబ్‌ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయని కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు ఒకరు హెచ్చిరంచిన విషయం తెలిసిందే. సో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Aadhar Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News