Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalMirror | ఇంట్లో అద్దం ఏ దిక్కున పెడితే అదృష్టం వరిస్తుంది?

Mirror | ఇంట్లో అద్దం ఏ దిక్కున పెడితే అదృష్టం వరిస్తుంది?

Mirror | ప్రతి ఇంట్లో అద్దం కామన్‌గా ఉంటుంది. మొహం చూసుకోవడానికి ఉపయోగించే అద్దం.. ఆనందం, అదృష్టానికి సంబంధించింది. కాబట్టి దీన్ని వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా సరైన ప్లేస్‌లోనే పెట్టాలి. లేదంటే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సరైన ప్లేస్‌లో పెడితే మీ ఇంట్లో ఆనందానికి అవధులు ఉండవు. మరి ఇంట్లో అద్దం పెట్టేందుకు గల వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ నియమాలు తప్పనిసరి

వాస్తు ప్రకారం పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోవద్దు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా చతురస్ర, దీర్ఘచతురస్రాకార, అష్టభుజి అద్దం మాత్రమే అమర్చాలి. బాత్‌రూంలో అద్దం పెట్టాలని అనుకుంటే దాన్ని తలుపు ఎదురుగా అస్సలు పెట్టవద్దు.

బెడ్రూంలో అద్దం పెట్టకపోవడమే దాంపత్యానికి మంచిది. మీ మంచం ప్రతిబింబం అద్దంపై పడేలా ఉంటే దంపతుల ఆత్మవిశ్వాసం, సామరస్యం తగ్గిపోతుంది. ఒకవేళ వేరే రూంలో ఖాళీ స్థలం లేకపోవడంతో బెడ్రూంలోనే అద్దం పెట్టాల్సి వస్తే.. పడుకునేప్పుడు దాన్ని కర్టెన్‌ లేదా ఓ బట్టతో కవర్‌ చేయడం మంచిది. దీనిద్వారా వాస్తు దోషాలను నివారించవచ్చు.

ఈ దిశలో అద్దం పెట్టకూడదు

ఇంటికి ఆగ్నేయ దిశలో అద్దం ఉంచకూడదు. దీని ద్వారా కుటుంబసభ్యుల మధ్య విబేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కలహాలు పెరిగి విడాకులకు దారి తీయొచ్చు. నైరుతి దిశలో అద్దం ఉంచితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడూ అశాంతి, చికాకులతో ఉంటారు. వాయువ్య దిశలో అద్దం ఉంచితే గొడవలు, శత్రుత్వాలు పెరుగుతాయి. పడమర వైపు అద్దం ఉంటే కుటుంబసభ్యుల్లో సోమరితనం పెరుగుతుంది. దక్షిణం వైపు ఉంచినా కూడా లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.

అద్దం ఏ దిశలో ఉండాలి?

ఇంట్లో అద్దాన్ని ఎప్పుడూ కూడా తూర్పు, ఉత్తరం వైపు ఉన్న గోడలకే ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం. ఈ దిశలో అద్దం పెట్టడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. ధన లాభం పెరుగుతుంది. బాత్రూంలో అయితే తూర్పు, ఉత్తర గోడలపై ఉంచితే ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో అమర్చిన అద్దం భూమికి 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉండాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News