Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHealthPapaya Health Benefits | షుగర్‌ పేషెంట్స్‌ బొప్పాయి తినొచ్చా?

Papaya Health Benefits | షుగర్‌ పేషెంట్స్‌ బొప్పాయి తినొచ్చా?

Papaya Health Benefits | పల్లెటూళ్లకు వెళ్తే దాదాపు ప్రతి ఇంట్లో బొప్పాయి చెట్టు మనకు కనిపిస్తుంది. ఇంటింటిలోనూ కనిపించే ఈ బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. కేవలం వీటి పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. బొప్పాయి ఆకుల రసం తాగితే డెంగ్యూ వల్ల తగ్గిపోయిన తెల్లరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అందుకే మనం రోజు తినే ఆహారంలో కచ్చితంగా బొప్పాయి పండు ఉండేటట్లు చూసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరి బొప్పాయి తింటే కలిగిఏ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోనూ లేవంటే అతిశయోక్తి కాదు. బొప్పాయి పండు అన్ని కాలాల్లో తినొచ్చు. మధుమేహులు కూడా నిరభ్యంతరంగా బొప్పాయిని తినవచ్చు.

బొప్పాయి పండులో మన శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు మరియు మినరల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి ముక్కలలో దాదాపు 62 క్యాలరీలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులో ఉంటాయి. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి.

బొప్పాయి లో ఉండే పపెయిన్ అనే పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు రాకుండా బొప్పాయి పండు ఎంతగానో పనిచేస్తుంది. చర్మ సౌందర్యం తో పాటు జుట్టు ఆరోగ్యానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి పండు తో ఫేస్ మాస్క్ వేసుకున్న, హెయిర్ మాస్క్ వేసుకున్న.. ముఖం, జుట్టు ఎంతో నిగారింపుని సంతరించుకుంటాయి. బొప్పాయి మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బొప్పాయి మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయి ముక్కలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా తగ్గుతారు. వీటిని వేడి నీళ్లలో వేసుకుని తాగినా, ఉదయాన్నే బొప్పాయిని ఏ విధంగానైనా ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.

షుగర్ పేషెంట్స్ సైతం బొప్పాయిని ఎలాంటి పరిమితులు లేకుండా తినవచ్చు. శరీరంలో టాక్సిన్స్ ని అంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ పండులో విటమిన్ ఏ ఉండటం వల్ల అది కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయి గుండె సంబంధిత కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా పని చేసేలా చేస్తుంది.

బొప్పాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల గట్టిదనానికి బొప్పాయి మేలు చేస్తుంది. బొప్పాయితో దంతాలు, చిగుళ్ళు సమస్యలు తగ్గుతాయి.బొప్పాయిని తినడం వల్ల నోటి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. బొప్పాయి వల్ల నోటి పూత తెల్లటి మచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఉంటాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News