Home Lifestyle Horoscope & Vaasthu Horoscope today | రాశిఫలాలు ( 22-12-2022 )

Horoscope today | రాశిఫలాలు ( 22-12-2022 )

Image Source : Pixabay

Horoscope today | మేషం

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

వృషభం

సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభం పొందుతారు. భూ, వాహన యోగం కలదు.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.

కర్కాటకం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

సింహం

భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థాన చలన సూచన ఉంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య

సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ, కళా రంగాలవారికి సన్మానాలు, సత్కారాలు పొందే సూచన ఉంది. బంధువుల నుంచి ధన, వస్తు లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల

వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన ఉంది.

వృశ్చికం

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి లాభ సూచన ఉంది.

ధనుస్సు

ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభం పొందుతారు. శుభవార్తలు వింటారు.

మకరం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు.

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విబేధాలు పరిష్కారమై ప్రశాంతంగా గడుపుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్‌.. కవిత, మాగుంట పేర్లు ప్రస్తావించిన ఈడీ

KTR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Sircilla kidnap | సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్… మేమిద్దరం ప్రేమించుకున్నాం.. తల్లిదండ్రులతోనే మాకు ప్రాణహాని..

Exit mobile version