Wednesday, July 24, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (12-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (12-02-2023)

Horoscope Today | మేషం

మీ మాటల నైపుణ్యంతో పలువురి ప్రశంసలు అందుకుంటారు. చెల్లింపులకు ఒత్తిడి అధికమవుతుంది. ష్యూరిటీ సంతకాలు తంటాలు తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తారు.

వృషభం

చిన్నపాటి అవరోధాలు అవలీలగా అధిరోహించగలుగుతారు. తనఖా వస్తువులు విడిపిస్తారు. రావాల్సిన ధనానికి హామీ లభిస్తుంది. వ్యాపారపరంగా సరికొత్త వ్యూహాలు అమలు పరుస్తారు.

మిథునం

దూర ప్రాంతాల్లోని మీ వారి యోగక్షేమాలను విచారిస్తారు. ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించి అంశాలు స్వల్పంగా లాభిస్తాయి.

కర్కాటకం

సహోద్యోగులతో సఖ్యత పెంచుకుంటారు. కలిసొచ్చే కాలం కోసం ఊహాలోకాల్లో విహరిస్తారు. కృషి కన్నా అదృష్టాన్ని ఈ రోజు ఎక్కువగా నమ్ముతారు. విహార యాత్రలు చేయాలని భావిస్తారు.

సింహం

సాధారణమైన విషయాల గురించి కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు. రహస్య రుణాలు చేస్తారు. సహోదర వర్గం సహాయసహకారాలను అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.

కన్య

ఆరోగ్యం నలతగా ఉంటుంది. నిర్ణయాలు అమలు పరిచేటప్పుడు నిష్ణాతుల సలహాలు తీసుకోండి. మాతృవర్గీయ బంధువులకు మీ వంతు సహాయ సహకారాన్ని అందిస్తారు.

తుల

డాక్యుమెంట్స్‌లో అవసరమైన మార్పులు చేస్తారు. సినీ కళారంగాల్లోని వారికి ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.

వృశ్చికం

ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి ప్రవేశం కల్పించకండి. పార్ట్ టైమ్‌ జాబ్‌ వర్క్స్‌ కలిసివస్తాయి. గతంలో మీకిచ్చిన మాట నేడు మీరు వారికి గుర్తుచేయడం వల్ల లబ్ధి కలుగుతుంది.

ధనుస్సు

ఇతరులు మీ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు. స్థిరత్వ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు.

మకరం

మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి బాధిస్తుంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ అవసరాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తారు.

కుంభం

స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది. వ్యక్తిగత సమస్యలు సానుకూల పరచుకోవడానికి శ్రేయోభిలాషులతో కలిసి చర్చలు సాగిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

మీనం

స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి విషయాన్ని ఈమకు అనుకూలంగా మలచుకోవడానికి గానూ మీ ప్రతిభాపాటవాలను కనబరుస్తారు. వాహనయోగ సూచన ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News