Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 04-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 04-02-2023 )

Horoscope Today | మేషం

ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాపరమైన ఆలోచనలు చోటుచేసుకుంటారు. సన్నిహిత మిత్రులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు.

వృషభం

మీ మీద చేసిన అపవాదులను రూపుమాపుకునే ప్రయత్నాలకు గానూ శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండటం వల్ల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

మిథునం

జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. పొదుపు పథకాలకు గండి పడుతుంది. దేవాలయాల సందర్శనం చేసుకుంటారు.

కర్కాటకం

కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన సలహాలను సూచనలను పెద్దల నుంచి అందుకుంటారు. ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు.

సింహం

మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారి తీస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది.

కన్య

మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వారికి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.

తుల

మీ హోదాను పెంచే విధంగా సంతానం అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఎంతోకాలంగా వాయిదా వడుతూ వస్తున్న ఒకానొక విషయంలో తెగించి మొండి ధైర్యంతో నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చికం

ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తారు. ఇందుకు గాను ధనాన్ని అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న మీ శ్రేయోభిలాషులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు.

ధనుస్సు

మీ మిత్రవర్గంలోని ఒకరితో అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి. మెరుగైన జీవితాన్ని సాగించడానికి అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం

స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది. సంప్రదాయాలకు విలువనిచ్చి ఆధునిక పోకడలకు దూరంగా ఉంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కుంభం

రుణాలకు సంబంధించి విషయాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. మనసుకు తోచిందే చేయడం తప్ప ఇతరుల మాటను లెక్క పెట్టరు. ఆదాయ, వ్యయాలు సరిసమానంగా ఉంటాయి.

మీనం

ఇన్‌కం ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ విషయమై శ్రద్ధ కనబరచండి. సామాజిక సేవా సంస్థలను, వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News