Sunday, April 14, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (24-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (24-02-2023 )

Horoscope Today | మేషం

వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. సహోదర, సహోదరి వర్గానికి మీవంతు సహాయసహకారాలు అందిస్తారు. స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు. ఇది లాభించే అంశం కాదు.

వృషభం

వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి. రహస్య చర్చలు మంతనాలు సాగిస్తారు. ప్రముఖుల అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలు చక్కబరచుకోగలుగుతారు.

మిథునం

మీ మాటలకు విలువ పెరుగుతుంది. పరాధాన్యత కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం

మిత్రులు లేక బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలు ఉన్నాయి. సొంతవర్గాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తారు.

సింహం

నిష్కారణమైన కలహాలను పరిష్కరించుకోవడానికి మౌనమే శరణ్యం. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అండదండగా నిలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి,

కన్య

ఆవేశానికన్నా ఆలోచనకు ప్రాధాన్యతనిస్తారు. ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా మసలుకుంటారు. రుణం ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలిసి రావు. చెల్లింపులు సకాలంలో చెల్లించగలుగుతారు.

తుల

కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వాదాలకు చోటు కల్పించరు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు సానుకూల పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి సాధించడానికి చేపట్టే చర్యల్లో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి

ధనుస్సు

ప్రత్యర్థివర్గంపై విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్టు వంటి అంశాలు కలిసివస్తాయి. ఉన్నతస్థాయి వర్గం కూడా మీ సలహాలు సూచనలు పాటిస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

మకరం

వినూత్నంగా ఆలోచనలు సాగిస్తారు. స్థిరాస్తుల తాలూకూ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చాలావరకు అనేక విషయాలు మీ కనుసన్నుల్లో నడుస్తున్నట్లు భావిస్తారు. వాహనయోగ సూచన ఉంది.

కుంభం

మీలోని ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. గౌరవప్రదమైన స్థానంలోని వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులు అందుకుంటారు.

మీనం

చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లు భావిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News