Thursday, April 18, 2024
- Advertisment -
HomeEntertainmentSankranti Movies in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఎక్కడ స్ట్రీమింగ్...

Sankranti Movies in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Sankranti Movies in OTT | సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర సినిమాల సందడి ఓ రేంజ్‌లో జరిగింది. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీపడ్డారు. అలాగే తమిళ స్టార్ హీరోలు అజిత్‌కుమార్, విజయ్ మధ్య పొంగల్‌కు గట్టి ఫైట్ జరిగింది. ఆశ్చర్యంగా అన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్లను రాబట్టాయి. నలుగురు స్టార్ హీరోలు పోటీపడుతున్న టైమ్‌లో నేను కూడా ఉన్నానంటూ కళ్యాణం కమనీయం సినిమాతో వచ్చిన సంతోశ్ శోభన్ కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి.

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఐదు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అజిత్ కుమార్ నటించిన తెగింపు సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సంతోశ్ శోభన్, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన కళ్యాణం కమనీయం ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేశాయి. ఈ రెండు కూడా సంక్రాంతికి యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. కాబట్టి కాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూడు సినిమాల వంతు వచ్చేసింది,

ఈ మూడు సినిమాల్లో ముందుగా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ డబ్బింగ్ చిత్రం వారసుడు వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.

వారసుడు తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలోకి వస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. శ్రుతి హాసన్ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రీఎంట్రీ తర్వాత ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన చిరంజీవి.. ఈ సినిమాలో తన ఓల్డ్ మేనరిజంతో పూనకాలు తెప్పించాడు. అందుకే ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News