Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentKriti Sanon | ప్రభాస్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కృతిసనన్‌.. తనకు కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్‌...

Kriti Sanon | ప్రభాస్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కృతిసనన్‌.. తనకు కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Kriti Sanon | సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు 1 నేనొక్కడినే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్‌. కానీ టాలీవుడ్‌లో ఈమెకు కలిసి రాలేదు. తెలుగులో కృతి నటించిన రెండు సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో చేసిన సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో అక్కడే సెటిలయ్యింది. తక్కువ టైమ్‌లోనే అక్కడ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. దీంతో టాలీవుడ్‌పై సీతకన్ను వేసింది. ఇప్పుడు చాలా సంవత్సరాలకు ప్రభాస్‌తో కలిసి నటించిన ఆదిపురుష్‌ పాన్‌ ఇండియా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సమయంలోనే ప్రభాస్‌తో కృతిసనన్‌ డేటింగ్‌లో ఉందని.. తొందరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్‌.. ప్రభాస్‌తో రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చింది. అలాగే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది.

తన ఫస్ట్‌ మూవీనే సూపర్‌స్టార్‌తో చేయడం తన అదృష్టమని చెప్పింది కృతిసనన్‌. నిజానికి అప్పట్లో మహేశ్‌ బాబు గురించి గానీ.. తెలుగు సినిమాల గురించి గానీ తనకు ఐడియా లేదని.. అదే తనకు సెట్‌లో ప్లస్‌ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఆ సినిమా టైమ్‌లో తనకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదని.. భాష రాని తనకు ఇన్ని డైలాగులు ఎందుకిస్తున్నారని సుకుమార్‌ దగ్గర అలిగేదాన్ని అని గుర్తుచేసుకుంది. అయితే ఇప్పుడు తన తెలుగు కొంచెం మెరుగుపడిందని తెలిపింది. దానికి కారణం ప్రభాస్‌ అని తెలిపింది. ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌లో ప్రభాస్‌ తనకు తెలుగు నేర్పించాడని చెప్పింది. ఆదిపురుష్‌ మొదలైన కొత్తలో ప్రభాస్‌కు హిందీ వచ్చేది కాదని.. ఇప్పుడు మాత్రం ధారాళంగా మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగే ప్రభాస్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై కూడా స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటున్నారని చెప్పిన ఆమె.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ప్రభాస్‌ తనకు మంచి కో స్టార్‌ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రభాస్‌ సెట్స్‌లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారని.. ఈ మాత్రం దానికే ప్రేమ, పెళ్లి అంటూ ఏవేవో రాయడం సరికాదని హితవు పలికింది.

కాబోయే భర్త అలా ఉండాలి

ప్రభాస్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన కృతిసనన్‌ తన జీవితంలో లవ్‌ ఎఫైర్‌ల గురించి కూడా వివరించింది. చిన్నప్పుడు, ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండటం సహజమేనని.. తనకు కూడా రెండు మూడుసార్లు ఆ ఫీలింగ్‌ అనుభవించానని తెలిపింది. కానీ అప్పట్లో చాలా భయస్తురాలిని కావడంతో.. ఎవరితో మాట్లాడేదాన్ని కాదని చెప్పింది. అందుకే తాను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర కూడా నోరు మెదపలేకపోయానని తెలిపింది. కానీ ఆ మూమెంట్స్‌ మాత్రం ఇంకా తనకు గుర్తున్నాయని పేర్కొంది. కాబోయే భర్త తనకంటే పొడవుగా.. అందగాడై ఉండాలని చెప్పుకొచ్చింది. వాటితో పాటు మంచి మాటకారై ఉండాలని.. తనతో ఎప్పటికీ బోర్‌ కొట్టకుండా ఉండేలా చూసుకునే వాడు అయి ఉండాలని మనసులో మాట చెప్పుకొచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Movie Ticket Only for One rupee | హైదరాబాదీలకు బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే సినిమా టికెట్‌.. నో కండీషన్స్‌

Keerthy Suresh | తెలుగు ఇండస్ట్రీపై ‘మహానటి’కి కోపం వచ్చిందా ? ఆ సినిమా కీర్తి సరేశ్‌ కెరీర్‌కు మైనస్‌ అయిందా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News