Monday, April 29, 2024
- Advertisment -
HomeEntertainmentPrabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Prabhas Shirt | సిల్వర్ స్క్రీన్ మీద పవర్‌ఫుల్ పంచ్ డైలాగులతో ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ( Unstoppable with NBK ) తో తనలోకి కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. తన షోకి వచ్చిన సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేయడమే కాదు.. వాళ్లతో కామెడీలు చేస్తూ తనలోని హ్యూమర్‌ను బయటపెట్టాడు. దీంతో ప్రముఖ ఓటీటీ ( OTT )ప్లాట్‌ఫామ్‌ ఆహా (Aha )లో టెలికాస్ట్ అవుతున్న ఈ టాక్ షోకి ఎవరెవరు వస్తారా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తర్వాత ఎపిసోడ్‌కి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజైంది. ఇందులో బాలయ్య బాబుతో ఆకట్టుకోవడానికి రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ వచ్చారు. ఈ వీడియో చూసి ఇప్పుడు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ టాక్ షోలో ప్రభాస్ వేసుకొచ్చి షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెగ్యులర్‌గా ప్రభాస్ ఏ ఈవెంట్‌లకు వెళ్లినా ఒకేరకమైన డ్రెస్సింగ్ ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపిస్తుంటాడు. అలాంటిది బాలయ్య షోలో కలర్‌ఫుల్ షర్ట్ వేసుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ దృష్టి అంతా ఆ షర్ట్‌పైనే పడింది. అస్సలు ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్. దాని ధర ఎంత ఉంటుందా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దానికి సమాధానం కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ సమాచారం ప్రకారం ప్రభాస్ వేసుకున్న షర్ట్ పోలో రాల్ఫ్ లారెన్స్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ కంపెనీకి చెందినది అని తెలుస్తోంది. దీని ధర సుమారు 115 పౌండ్లు ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 11,618 రూపాయలు. ఈ షర్ట్ ధర తెలిసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ డార్లింగ్ డిఫరెంట్‌గా కనబడుతున్నాడని ఖుషీ అవుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News