Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentSukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Sukrithi Ambati | కేరింత ( kerintha ) సినిమాలో భావన ( Bhavana ) గుర్తుందా? హీరో ఫ్రెండ్స్‌ బ్యాచ్‌లో ఉంటూ.. పల్లెటూరి నుంచి వచ్చిన పార్వతీశాన్ని ప్రేమిస్తుంది. ఆ సినిమాతో భావనగానే గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి అసలు పేరు సుకృతి అంబటి. ఆ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా ఈ అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

sukrtihi

సుకృతి కేవలం ఒక్క కేరింత సినిమాలోనే నటించింది. అందులో నటించడం కూడా అలా జరిగిపోయింది అంతే. కురక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఒకసారి అంబటి సుకృతి వెళ్లింది. అక్కడ కేరింత మూవీ కోసం స్టార్‌ హంట్‌ జరుగుతుందని తెలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు పంపించింది. అవి నచ్చడంతో సుకృతిని భావన పాత్రకు ఎంపిక చేశారు. అలా కేరింత సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చిన పార్వతీశం అమాయకత్వాన్ని ఇష్టపడి అతన్ని ప్రేమించే భావన క్యారెక్టర్‌లో నటించింది. భావన క్యారెక్టర్‌కు అప్పట్లో మంచి క్రేజ్‌ దక్కింది. సినిమాలో మిగతా స్టార్స్‌ కంటే ఎక్కువగా ఈమెకే పేరొచ్చింది. కానీ ఏమైందో ఏమోగానీ మళ్లీ వేరే సినిమా కమిట్‌ కాలేదు. చదువులపైనే దృష్టిపెట్టింది. సినిమాలకు దూరమైనా సరరే సోషల్‌మీడియాలో మాత్రం సుకృతి యాక్టివ్‌గానే ఉంటుంది.

కొంతకాలంగా అక్షయ్‌ సింగ్‌ అనే వ్యక్తితో సుకృతి ప్రేమలో ఉంది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకోవడంతో జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను సుకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News