Thursday, April 25, 2024
- Advertisment -
HomeBusinessVistara | విమాన సిబ్బందిని తిట్టి.. అర్థనగ్నంగా నడిచిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత ఏమైంది?

Vistara | విమాన సిబ్బందిని తిట్టి.. అర్థనగ్నంగా నడిచిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత ఏమైంది?

Vistara | అబుదాబి- ముంబై విస్తారా విమానంలో ఓ ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. విమాన సిబ్బంది పై దాడి చేయడమే కాకుండా ఉమ్మి వేసి దారుణంగా ప్రవర్తించింది. విమానంలో ఆమె చేస్తున్న వికృత చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా వినకుండా దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 45 ఏళ్ల ఇటాలియన్‌ మహిళ పావోలా పెరుక్కియాను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎకానమీ క్లాస్‌ టికెట్ తీసుకుని బిజినెస్‌ క్లాస్‌లో కూర్చోవాలని పట్టుబట్టింది.

ఆ మహిళను ఆపడానికి ప్రయత్నించిన సిబ్బందిపై దాడికి దిగిందని విస్తారా ఎయిర్‌ లైన్స్‌ తెలిపింది. సిబ్బందిని కొట్టడంతో పాటు విమానంలో అర్థ నగ్నంగా తిరిగిందని పేర్కొంది. క్యాబిన్‌ క్రూ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విమానం గాలిలో ఉండగానే సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో ముంబై పోలీసులు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ముంబై కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News