MI vs RCB | టైమ్ 2 న్యూస్, ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరహాలోనే డబ్ల్యూపీఎల్‌లో ముంబై జట్టు దూసుకెళ్తోంది. లీగ ఆరంభ పోరులో గుజరాత్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 155 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన బెంగళూరుకు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. స్మృతి మందన (23), రిచా ఘోష్ (28), కనిక అహూజ (22), శ్రెయాంక పాటిల్ (23), మేగన్ షుట్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ 3, సైకా ఇషాఖ్, అమేలియా కెర్ర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), స్కీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) విజృంభించారు. హీలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కలిసిరాని టాస్..
గత మ్యాచ్‌లో ఛేజింగ్ ఎంచుకొని భంగపడ్డ బెంగళూరు.. ఈసారి మొదట బ్యాటింగ్ చేసినా రాత మారలేదు. కెప్టెన్ స్మృతి మందనతో పాటు సోఫియా డివైన్ (16) ధాటిగా ఆడటంతో ఆరంభంలో స్కోరు బోర్దు పరుగులు పెట్టింది. ఈ దశలో ముంబై బౌలర్లు సత్తాచాటి నాలుగు పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దిశ (0), పెర్రీ (13), హీతర్ నైట్ (0) విఫలమయ్యారు. ఇక బెంగళూరు పనైపోయినట్లే అనుకుంటున్న సమయంలో మిడిలార్డర్ పోరాడింది. రిచా, కనిక, శ్రెయాంక, షుట్ కాస్త పోరాడటంతో బెంగళూరు చివరకు పోరాడే స్కోరు చేయగలిగింది.
దంచుడే.. దంచుడు..
గత మ్యాచ్‌లో ఎక్కడ ఆపారో ముంబై ప్లేయర్లు అక్కడి నుంచే బాదుడు ప్రారంభించారు. హీలీ మాథ్యూస్‌తో పాటు మరో ఓపెనర్ యస్తిక భాటియా (23; 4 ఫోర్లు) ఎడాపెడా బౌండ్రీలు కొట్టడంతో చేజింగ్‌లో ముంబైకి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కీవర్ బ్రంట్.. మరింత రెచ్చిపోయింది. అటు మాథ్యూస్, ఇటు బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి వీరబాదుడు ముందు బెంగళూరు లక్ష్యం చిన్నబోయింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది