Tuesday, April 30, 2024
- Advertisment -
HomeNewsAPPawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

Pawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారాహి రోడ్డు మీద తిరగనివ్వమని నానా హడావిడి, రచ్చ చేశారని, ఆపేస్తామని మాట్లాడారని… వారెవరు కూడా మమ్మల్ని ఆపలేరని పవన్ అన్నారు. ప్రజల సొమ్మును దోచుకుని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించేవారికే అంతుంటే… ఏ తప్పు చేయని మాకెంత ధైర్యం ఉండాలని అన్నారు.

చట్టానికి అతీతంగా హత్యలు, కోడి కత్తితో పొడిపించుకుని డ్రామాలు నేను చేయను అన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని వివరించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నా బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి నేను పార్టీని ప్రారంభించాను. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన కార్యాలయానికి రావొచ్చని అన్నారు.

ఎన్నో సంవత్సరాల క్రితం బ్రిటీష్ వారు దేశాన్ని వదిలి పోయినప్పటికీ వారి అహంకార ధోరణి ఇంకా పోలేదు. నేను అవగాహన లేకుండా దేనిపైనా మాట్లాడనని చెప్పారు. యూనివర్సిటీల్లో చదవకపోయినా నోటికి ఏది వస్తే అది మాట్లాడనని అన్నారు. కులాల మధ్య ఐక్యత కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు.

ఒక చెయ్యి సొంత కులం వైపు, మరో చెయ్యి వేరే కులాల వైపు ఉండాలని అన్నారు. లేకపోతే మిగిలిన కులాల వారికి దూరమవుతామని చెప్పారు. రాష్ట్రంలో కులపిచ్చి బాగా ఉందని వివరించారు. ఇది ప్రజాస్వామ్యం… కుల స్వామ్యం కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా యువత బయటకి రావాలి లేకుంటే అన్యాయాన్ని ఎదిరించలేక బానిసల్లా ఉండిపోతారని అన్నారు.

పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. పార్టీ నిర్మాణానికి సమయం పడుతుంది పెరుగు తోడు వేస్తే… అది తోడుకోవడానికి రాత్రి సమయం పడుతుంది. పార్టీ నిర్మాణం పై దశాబ్దం పాటు వేచి చూసిన తర్వాత.. అప్పుడూ ఎటూవైపు వెళ్తుందో చూసుకుందాం అని పవన్ అన్నారు. రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు.

వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా..? రాజ్యాంగం గురించి ఏం తెలుసు అంటూ వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. వేర్పాటు వాదం అంటూ ఎవరైనా మాట్లాడితే తన అంత తీవ్రవాది ఇంకొకరు ఉండడని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పారు.

నాకు పెద్దగా భయాలు లేవని, జీవితంలో ఏం ఆశించనని ప్రాణాలంటే లెక్కలేదని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. పదవులు రాలేదని రాష్ట్రాన్ని విడగొట్టేస్తావా అంటూ ధర్మాన ప్రసాదరావు మీద విరుచుకుపడ్డారు. రాయలసీమ నుంచి ఎంతమంది సీఎంలు వచ్చారు? ఆ ప్రాంత అభివృద్ధికి వారు ఎంత కృషి చేశారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలా..? ఎందుకు దోచుకున్నది సరిపోలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చిపిచ్చి కామెంట్స్ ఇంకోసారి చేస్తే విసిగిపోయిన ప్రజలు ఊరుకోరని అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News