Horoscope Today | మేషం
పనుల్లో ఆటంకాలు ఏర్పడినా అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.
వృషభం
బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశ సూచన ఉంది.
మిథునం
సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.
కర్కాటకం
రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
సింహం
పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగుతాయి.
కన్య
నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
తుల
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
వృశ్చికం
మిత్రుల నుంచి ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటాబయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
ధనుస్సు
శుభవార్తలు వింటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుంచి ధనలాభం ఉంది. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
మకరం
కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు పదోన్నతులు పొందే సూచన ఉంది. వస్తువులు కొనుగోలు చేసే సూచన ఉంది.
కుంభం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది.
మీనంమీనం
వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వర్తిస్తారు.ధనలాభం పొందుతారు.
Read More Articles |
Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?