Kajal Aggarwal | సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. గౌతమ్ కిచ్లూతో పెండ్లి, పండంటి బాబుకు జన్మనివ్వడం అన్నీ వెంటవెంటనే జరిగిపోవడంతో కాజల్ అగర్వాల్ చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన కాజల్ కోస్టీ సినిమాతో వచ్చినప్పటికీ జనాలు ఎవరూ పట్టించుకోలేదు. ఇక కాజల్ పని అంతేనా అనుకుంటున్న టైమ్‌లోనే బాలకృష్ణ 108వ సినిమా భగవంత్ కేసరిలో హీరోయిన్గా ఎంపికై బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇది చూసి కాజల్ అగర్వాల్ మళ్లీ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఇంతలోనే కాజల్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందనే వార్త ఫిలిం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. అదేంటి ఇప్పుడిప్పుడే కెరీర్ మళ్లీ సెట్ అవుతుంది.. అంతలోనే సినిమాలు మానేయాలని కాజల్ ఎందుకు డిసైడ్ అయ్యిందని ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. దానికి ఇప్పుడు ఒక్కటే సమాధానం వినిపిస్తుంది.
కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్లీ గర్భం దాల్చడంతోనే సినిమాలకు దూరంగా ఉండాలని కాజల్ ఫిక్సయినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే కాజల్ అగర్వాల్ పీఆర్ టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించినట్లు సమాచారం. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లూను 2020లో కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదిలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. మాతృత్వ మధురిమలు పూర్తిగా ఆస్వాదించకుండానే కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వర్కవుట్స్ చేసి మళ్లీ ఎప్పటిలా స్లిమ్‌గా మారిపోయింది. సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇలా సినిమాలు చేస్తూనే తన బిజినెస్‌లతో తీరిక లేకుండా గడిపేస్తుంది. దీంతో తన కొడుకు ఆలనాపాలనా చూసుకోవడం కుదరడం లేదంట. అందుకే తన కుమారుడి బాగోగులు దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఆమె పీఆర్ టీం చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read More Articles |
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?