Tuesday, April 30, 2024
- Advertisment -
HomeLatest NewsRCB vs MI | బెంగళూరు ఓపెనింగ్‌ అదుర్స్‌.. ముంబైపై ఘనవిజయం

RCB vs MI | బెంగళూరు ఓపెనింగ్‌ అదుర్స్‌.. ముంబైపై ఘనవిజయం

RCB vs MI | టైమ్‌ 2 న్యూస్‌, బెంగళూరు: ఓపెనర్లు దంచికొట్టడంతో ఐపీఎల్‌-16వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కొట్టింది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (1), ఇషాన్‌ కిషన్‌ (10), కామెరూన్‌ గ్రీన్‌ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (15) విఫలమవడంతో ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (46 బంతుల్లో 84 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడగుతున్నా.. ఒంటరి పోరాటంతో ముంబైకి పోరాడే స్కోరు అందించాడు. గత సీజన్‌లో చక్కటి ప్రదర్శనతో నమ్మదగ్గ ప్లేయర్‌గా ఎదిగిన తిలక్‌ వర్మ.. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ తన విలువ చాటుకున్నాడు. సీనియర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుతున్నా.. ఏమాత్రం కంగారు పడకుండా తొలుత క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన తిలక్‌ వర్మ.. ఆ తర్వాత విశ్వరూపం కనబర్చాడు. బంతిని సరిగ్గా మిడిల్‌ చేస్తూ.. ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. బెంగళూరు బౌలర్లలో కరణ్‌ శర్మ 2, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇద్దరూ ఇద్దరే..

అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 82; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో బెంగళూరు సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై.. బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేయలేకపోయింది. జస్ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో జాసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, జొఫ్రా ఆర్చర్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకున్నా.. బెంగళూరు ప్లేయర్లను నిలువరించలేకపోయారు. కామెరూన్‌ గ్రీన్‌, అర్షద్‌ ఖాన్‌, పియూష్‌ చావ్లా రూపంలో నాణ్యమైన బౌలర్లు ఉన్నా.. బెంగళూరు ఓపెనర్ల దూకుడు ముందు వీరి ఆటలు కొనసాగలేదు.

ఆరంభంలో డుప్లెసిస్‌ దంచికొడుతుంటే.. అతడికి సహకరించిన కోహ్లీ.. ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కోహ్లీ 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించిన అనంతరం డుప్లెసిస్‌ ఔటైనా.. మ్యాక్స్‌వెల్‌ (3 బంతుల్లో 12 నాటౌట్‌; 2 సిక్సర్లు) అండతో కోహ్లీ మిగిలిన పని పూర్తిచేశాడు. విరాట్‌, డుప్లెసిస్‌ దూకుడుతో బెంగళూరు మరో 22 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunrisers Hyderabad | పరాజయంతో రైజర్స్‌ ప్రయాణం ప్రారంభం.. రాజస్థాన్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి – Time2news.com

PV Sindhu | పీవీ సింధు రన్నరప్‌తో సరి.. స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో పరాజయం

LSG vs DC | సొంతగడ్డపై లక్నో తొలి విజయం.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News