Actress Meena

మీనాను పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరో ఎవరు?

సీనియర్ హీరోయిన్ మీనా పెళ్లి విషయం సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

గత ఏడాది జూన్‌లో మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోకముందు నుంచే రెండో పెళ్లి వార్తలు మొదలయ్యాయి.

White Lightning
Orange Lightning

తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఏదీ లేదని ఎన్నిసార్లు చెప్పినా వదంతులు మాత్రం ఆగడం లేదు.

తాజాగా తమిళ నటుడు బెయిల్వన్ రంగనాథన్ వ్యాఖ్యలతో మీనా పెళ్లి విషయం మళ్లీ తెరమీదకు వచ్చింది.

White Lightning

తమిళ ఇండస్ట్రీకి చెందిన 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్‌ను మీనా వివాహం చేసుకోబోతుందని రంగనాథన్ తెలిపాడు.

జూలైలో వీళ్లిద్దరికీ పెళ్లి జరగబోతుందని బెయిల్వన్ రంగనాథన్ యూట్యూబ్ ఛానల్‌తో చెప్పుకొచ్చాడు.

White Lightning
White Lightning

ఈ క్రమంలో తమిళ స్టార్ హీరోతో ఇప్పటికే మీనా ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయ్యిందని ప్రచారం జరుగుతోంది.

మీనా రెండో పెళ్లి వార్త వైరల్‌గా మారడంతో ఆ తమిళ స్టార్ హీరో ఎవరని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే మీనా చేసుకోబోయే ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

రజినీ పెద్ద కూతురు ఐశ్వర్యతో విడిపోయిన ధనుష్ కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే మీనాతో పెళ్లికి సిద్ధమయ్యాడని.. ఇప్పటికే వీళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ధనుష్‌తో మీనా పెళ్లి వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే