Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowGoogle Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Google Search | ఒక‌ప్పుడు అంటే వాళ్ల‌ను వీళ్ల‌ను అడిగి తెలుసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఏ చిన్న విష‌యం తెలియ‌క‌పోయినా చేతిలో మొబైల్ తీసుకుంటున్నారు. గూగుల్‌లో త‌మ‌కు కావాల్సిన వివ‌రాల‌ను సులువుగా వెతికేస్తున్నారు. కొత్త కొత్త విష‌యాలు ఏవి తెలుసుకోవాల‌న్నా గూగుల్ మీద‌నే డిపెండ్ అవుతున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఏది ప‌డితే అది అని గూగుల్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని అనుకుంటే చిక్కుల్లో ప‌డ‌తారు. కొన్ని ప‌దాల‌ను వెతికితే జైల్లో ఊస‌లు లెక్క‌పెట్టే ప‌రిస్థితి కూడా రావ‌చ్చు. మ‌రి ఆ ప‌దాలేంటి? వాటిని ఎందుకు సెర్చ్ చేయ‌కూడ‌దు? తెలుసుకుందాం..

చైల్డ్ ఫోర్నోగ్ర‌ఫీ

చైల్డ్ పోర్నోగ్ర‌ఫీ మీద అన్ని దేశాల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కాబ‌ట్టి ఈ పదాల‌ను సెర్చ్ చేసిన‌ప్పుడు ప్ర‌భుత్వాలు మ‌న ఐపీ అడ్ర‌స్‌ల‌ను ట్రాక్ చేస్తాయి. కాబ‌ట్టి పిల్ల‌ల అశ్లీల‌త‌కు సంబంధించి గూగుల్‌లో వెతుకుతూ ప‌ట్టుబ‌డితే మ‌న దేశంలో అయితే పోక్సో చ‌ట్టం కింద‌ ఐదు నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

అబార్ష‌న్ల గురించి

వీటి గురించి మ‌న దేశంలో క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను తీసుకొచ్చారు. ఎవ‌రైనా అబార్ష‌న్ చేయించుకోవాల‌ని అంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. డాక్ట‌ర్ల ఆమోదం ఉంటేనే అబార్ష‌న్ చేయ‌డం సాధ్య‌ప‌డుతుంది. కాబ‌ట్టి సొంతంగా గ‌ర్భ‌స్రావం చేయ‌డం గురించి గూగుల్ వెతికితే ఇబ్బందులు త‌ప్ప‌వు.

బాంబు, మ‌ర‌ణాయుధాల త‌యారీ

వీటి గురించి అనుకోకుండా గూగుల్‌లో సెర్చ్ చేసిన ఇబ్బందుల్లో ప‌డ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఇలాంటి కీవర్డ్స్‌ను వెతికే వారిపై భ‌ద్ర‌తా ఏజెన్సీలు ప్ర‌త్యేక దృష్టి పెడుతుంటాయి. కాబ‌ట్టి ఎవ‌రైనా వీటి గురించి వెతికితే వాళ్లు సెక్యూరిటీ ఏజెన్సీల రాడార్‌లోకి వెళ్తారు. అప్పుడు వాళ్లు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు.

వ్య‌క్తిగ‌త వివ‌రాలు

మ‌న పేరు, ఫోన్ నంబ‌ర్‌, అడ్ర‌స్, ఈమెయిల్‌ను ఎప్పుడు కూడా మ‌నం వెత‌కొద్దు. ఎందుకంటే మ‌నం వెతికిన ప్ర‌తి ప‌దం గూగుల్‌లో డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. దీనివ‌ల్ల ప్రైవ‌సీకి భంగం క‌లిగే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వ్య‌క్తుల‌ ప‌ర్స‌న‌ల్ డేటాను సేక‌రించాల‌ని చాలా కంపెనీలు చూస్తుంటాయి. కాబ‌ట్టి గూగుల్ వంటి కంపెనీలు లేదా హ్యాక‌ర్లు మ‌న ప‌ర్స‌న‌ల్ డేటాను సేక‌రించి అడ్వ‌ర్టైజ్ కంపెనీల‌కు అమ్ముకుంటారు.

రోగాలు – వాటిని న‌యం చేసే ప‌ద్ధ‌తులు

గూగుల్‌లో చూపించే ప్ర‌తి విష‌యాన్ని మ‌నం న‌మ్మ‌డానికి వీల్లేదు. అందులో ఎంత మంచి ఉంటుందో చెడు కూడా అంతే ఉండే అవ‌కాశం ఉంటుంది. కాబట్టి మ‌న‌కు ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తితే వాటి గురించి గూగుల్‌లో వెతికి మ‌న‌మే సొంత వైద్యం చేసుకోవాల‌ని అనుకోవ‌ద్దు. దీనిద్వారా ఇబ్బందులో ప‌డే అవ‌కాశం ఉంది. ఇలాగే గూగుల్‌లో చూసి ట్రీట్‌మెంట్ తీసుకునే క్ర‌మంలో ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న ఘ‌ట‌న‌లు ఇదివ‌ర‌కు చాలానే చూశాం. కాబ‌ట్టి ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తే వాటి గురించి గూగుల్‌లో తెలుసుకోవ‌డం క‌న్నా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

క‌స్ట‌మ‌ర్ కేర్ ఫోన్ నంబ‌ర్లు

చాలామంది క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ల‌ను గూగుల్‌లో వెతికేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. వీటి గురించి ఆయా వెబ్‌సైట్ల‌లోకి వెళ్లే వెతుక్కోవాలి. ఎందుకంటే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సైబ‌ర్ మోసాల్లో చాలావ‌ర‌కు క‌స్ట‌మ‌ర్ కేర్ ముసుగులోనే జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి గూగుల్‌లో దొరికిన‌ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ల‌కు కాల్ చేస్తే సైబ‌ర్ నేర‌గాళ్ల ఉచ్చులో ప‌డే అవ‌కాశం ఉంటుంది.

బ్యాంకింగ్, ఈకామ‌ర్స్‌ వెబ్‌సైట్

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ కోసం చాలామంది గూగుల్‌లో ఆ బ్యాంక్ నేమ్ వెతికి వ‌చ్చిన లింక్ ద్వారా లాగిన్ అవుతుంటారు. ఇలా చేస్తే ఏదో ఒక రోజు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డ‌టం ఖాయం. బ్యాంకింగ్ వెబ్‌సైట్ల‌తో పాటు ఈకామ‌ర్స్‌, ప్ర‌భుత్వ వెబ్‌సైట్ల గురించి కూడా గూగుల్‌లో వెత‌క్క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. ఎందుకంటే ఇలా వెతికిన‌ప్పుడు బ్యాంక్ అధికారిక పేజీల కంటే కూడా సైబ‌ర్ మోస‌గాళ్లు క్రియేట్ చేసిన ఫిషింగ్ వెబ్‌సైట్ల‌లోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది.

యాప్స్, సాఫ్ట్ వేర్‌

యాప్స్‌, సాఫ్ట్‌వేర్స్ గురించి గూగుల్‌లో వెత‌క‌డం క‌న్నా వాటి అఫిషియ‌ల్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అదే మొబైల్స్‌లో అయితే ఆండ్రాయిడ్ యూజ‌ర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్‌, ఐఫోన్ యూజ‌ర్లు అయితే యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం శ్రేయ‌స్క‌రం.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News