Home Latest News Wifi password | వైఫై పాస్వర్డ్ ఇలా తెలుసుకోండి.

Wifi password | వైఫై పాస్వర్డ్ ఇలా తెలుసుకోండి.

Image by Freepik

Wifi password | మీ వైఫై పాస్వర్డ్ ఏంటి? సింపుల్ ప్రశ్ననే అయినా సరే దీనికి చాలామంది దగ్గర సమాధానం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ఆలోచనలో పడిపోతారు. దీనికి కారణం ఇంట్లో ఉన్న మొబైల్, లాప్టాప్, టీవీ, ఇతరత్రా స్మార్ట్ డివైజ్లకు ఎప్పుడో వైఫై కనెక్ట్ చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడూ దాని అవసరం రాదు కాబట్టి చాలామంది వైఫై పాస్వర్డ్ మరిచిపోతారు. మళ్లీ కొత్తగా ఏదైనా డివైజ్ తెచ్చినప్పుడు లేదా కొత్తగా ఇంటికి వచ్చిన ఎవరైనా పాస్వర్డ్ అడిగినప్పుడు.. దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి తర్జనభర్జనలు పడుతుంటారు. పాస్వర్డ్ గుర్తొస్తే ఓకే లేదంటే.. వైఫై రూటర్ను రీసెట్ చేసేస్తుంటారు. ఇప్పుడు అంత రిస్క్ లేకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ ఫోన్ ద్వారానే ఈజీగా వైఫై పాస్వర్డ్ ఏంటోతెలుసుకోవచ్చు. దీనికోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  1. మొబైల్ సెట్టింగ్స్లోని వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ వైఫై ఏ నెట్వర్క్కి కనెక్ట్ అయిందో చూపిస్తుంది. దాని పక్కనే సెట్టింగ్స్ సింబల్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని మరో మొబైల్తో స్కాన్ చేసి వైఫై పాస్వర్డ్ పొందవచ్చు.
  2. క్యూఆర్ కోడ్తో పాస్వర్డ్ పొందడం కుదరకపోతే.. వైఫై నెట్వర్క్ పక్కన ఉన్న సెట్టింగ్స్పై క్లిక్ చేయగానే మేనేజ్ రూటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయగానే.. రౌటర్ పేజి ఓపెన్ అయి సైన్ ఇన్ అడుగుతుంది. అప్పుడు రూటర్ వెనకాల ఉన్న యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఒక వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. అందులో వైర్లెస్ సెక్షన్పై క్లిక్ చేస్తే నెట్వర్క్ కీ అని ఉంటుంది. అదే మనకు కావాల్సిన వైఫై పాస్వర్డ్.
  3. పైన చెప్పిన విధానమే కానీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయకుండా.. మీ బ్రౌజర్లో 192.168.0.1 లేదా 192.168.1.1 ఐపీ అడ్రస్ ద్వారా రూటర్ పేజీ ఓపెన్ చేసి కూడా నెట్వర్క్ కీని పొందవచ్చు.
  4. థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి కూడా వైఫై పాసవర్డ్ పొందవచ్చు. దీనికోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వైఫై పాస్వర్డ్ రికవరీ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేస్తే అందుబాటులోఉన్న వైఫై రూటర్ల పేర్లను చూపిస్తుంది. అందులో మీకు కావాల్సిన రూటర్పై క్లిక్ చేయాలి. అప్పుడు దానికి సంబంధించిన వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. అందులో రూటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్చేసి, వైఫై సెక్షన్లోకి వెళ్లాలి. తద్వారా రూటర్ పాస్వర్డ్ తెలుసుకోవచ్చు.
  5. Follow Us :  Google News, FacebookTwitter
  6. Read More Articles:
  7. IB Recruitment 2023 | పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!
  8. Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!
  9. Preliminary key | పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష కీ విడుదల.. మొత్తం 6,100 పోస్టులు!
  10. Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!
  11. Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో
Exit mobile version