Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTeam India Schedule | కొత్త ఏడాది అయినా టీమిండియాకు కలిసొచ్చేనా? 2023 షెడ్యూల్ ఇదే

Team India Schedule | కొత్త ఏడాది అయినా టీమిండియాకు కలిసొచ్చేనా? 2023 షెడ్యూల్ ఇదే

Team India Schedule | కొన్ని విజయాలు.. మరెన్నో పరాజయాలతో ఓ ఏడాదిని టీమిండియా ముగించేసింది. ఇంకా చెప్పాలంటే 2022 టీమిండియాకు పెద్దగా కలిసిరాలేదు. ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా నిరాశ పరిచింది. ఈ పరాభావాలను మరిచిపోతూ కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో జరగబోయే కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్‌లో సత్తా చాటాలని ఆశిస్తుంది. శ్రీలంకతో జనవరి 3 నుంచి జరిగే టీ20 సిరీస్‌తో ఈ ఏడాదిని టీమిండియా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 2023లో టీమిండియా షెడ్యూల్‌ను ఒకసారి చూద్దాం..

శ్రీలంకతో..

జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లు ఆడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్ జరగనుంది.

జనవరి 3తొలి టీ20ముంబై
జనవరి 5రెండో టీ20పుణె
జనవరి 7మూడో టీ20రాజ్‌కోట్
జనవరి 10తొలి వన్డేగువాహటి
జనవరి 12రెండో వన్డేకోల్‌కతా
జనవరి 15మూడో వన్డేతిరువనంతపురం

న్యూజిలాండ్‌తో

శ్రీలంకతో సిరీస్ తర్వాత మళ్లీ స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది.

జనవరి 18తొలి వన్డేహైదరాబాద్
జనవరి 21రెండో వన్డేరాయ్‌పూర్
జనవరి 24మూడో వన్డేఇండోర్
జనవరి 27తొలి టీ20రాంచీ
జనవరి 29రెండో టీ20లఖ్‌నవూ
ఫిబ్రవరి 1మూడో టీ20అహ్మదాబాద్

ఆస్ట్రేలియాతో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టెస్ట్ ఛాంపియన్ 2021-23లో భాగంగా టీమిండియా ఆడే చివరి టెస్ట్ ఇదే.

ఫిబ్రవరి 9-14తొలి టెస్ట్నాగ్‌పూర్
ఫిబ్రవరి 17-21రెండో టెస్ట్ఢిల్లీ
మార్చి 1-5మూడో టెస్ట్ధర్మశాల
మార్చి 9-13నాలుగో టెస్ట్అహ్మదాబాద్
మార్చి 17తొలి వన్డేముంబై
మార్చి 19రెండో వన్డేవిశాఖపట్నం
మార్చి 22మూడో వన్డేచెన్నై

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్‌లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ గెలిస్తే ఈ ఫైనల్స్‌లోకి అడుగుపెడుతుంది.

వెస్టిండీస్‌తో..

జులై, ఆగస్టులో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. 2023-29 డబ్ల్యూటీసీలో భాగంగా రెండు టెస్టులు ఆడనుంది. అలాగే మూడు వన్డేలు, టీ20ల్లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించి తేదీలు ప్రకటించాల్సి ఉంది.

ఆసియా కప్

సెప్టెంబర్‌లో పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా ఆడటంపై సందిగ్ధం కొనసాగుతోంది. పాక్ గడ్డపై అడుగుపెట్టేది లేదని బీసీసీఐ చెబుతోంది. వేదిక మారితే తప్ప టీమిండియా ఆసియా కప్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు.

ఆస్ట్రేలియాతో మరోసారి

ఈ ఏడాదిలో అక్టోబర్‌లో రెండోసారి ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆసిస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇంకా మ్యాచ్ తేదీలు ఖరారు కాలేదు.

వరల్డ్ కప్

ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు తొలిసారిగా పూర్తిస్థాయిలో ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అక్టోబర్‌లో వరల్డ్ కప్ జరగనుంది. 1987, 1996, 2011లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది.

మూడోసారి ఆస్ట్రేలియాతో

వన్డే వరల్డ్‌కప్ తర్వాత మరోసారి ఆస్ట్రేలియాతో స్వదేశంలో భారత్ తలపడనుంది. ఈసారి ఐదు టీ20 సిరీస్‌లు జరుగుతుంది. నవంబర్‌లో ఈ మ్యాచ్‌లు ఉంటాయి.

దక్షిణాఫ్రికాతో ఫైనల్

దక్షిణాఫ్రికాపై డిసెంబర్‌లో జరిగే పోరుతో టీమిండియా 2023ని ముగించనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలతో టీమిండియా తలపడనుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!

Free Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సీఎం జగన్ నిర్ణయం

Rashmika Mandanna | రష్మికకు కాంతారా డైరెక్టర్‌కు మధ్య గొడవలేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News