Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentKL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

KL Rahul | ఎట్టకేలకు ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అథియా శెట్టి ( Athiya Shetty )తో తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక జరగనుందని సమాచారం.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురు అథియా శెట్టితో కేఎల్‌ రాహుల్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అథియా పెళ్లి జరగాల్సి ఉంది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి కూడా బీటౌన్‌లో చాలాసార్లు వార్తలు వినిపించాయి. నూతన సంవత్సరం ప్రారంభంలోనే వీరి పెళ్లి జరగబోతుందటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అది కన్ఫార్మ్‌ కాలేదు. ఎట్టకేలకు జనవరి 23న ఖండాలాలో వివాహానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వారసురాలిగా 2015లో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది అథియా శెట్టి. హీరో అనే చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడు సంవత్సరాలుగా కేఎల్ రాహుల్‌, అథియా డేటింగ్‌లో ఉన్నారు. చాలారోజులు వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ అప్పటికే తమ గురించి బీటౌన్‌లో గుసగుసలు వినిపించడంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారు. ఈ జోడికి దక్షిణ భారత సంప్రదాయంలో పెళ్లి జరగనుంది. సునీల్ శెట్టి మంగళూరుకు చెందిన వాడు కాగా… రాహుల్ కుటుంబం కూడా మంగళూరుకు చెందినదే. అందుకే ఈ పెళ్లిని కన్నడ సంప్రదాయంలోనే జరిపించనున్నారు.

సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు సినీ, క్రీడా ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే అతిథుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Virat Kohli Daughter | కూతురితో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్న విరాట్, అనుష్క శర్మ.. ఈసారి కూడా అదే ట్విస్ట్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

India Vs Sri Lanka | భారత్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్టులో ఎవరున్నారు?

Gautham Gambhir | శ్రీలంక చెత్త బౌలింగ్‌ వల్లే కోహ్లీ సెంచరీ చేశాడు.. సచిన్‌తో కోహ్లీని పోల్చడంపై గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దూసుకెళ్లిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టాప్‌ 10లో బౌలర్లకు దక్కని చోటు

India Vs Srilanka | శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News