Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లండ్

T20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లండ్

T20 world cup – SCOTLAND vs West Indies | టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ ను.. పసికూన స్కాంట్లాండ్ చిత్తుగా ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్ లోనే శ్రీలంకను నమీబియా ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టోర్నీలో రెండు పెద్ద జట్లు పసికూనల చేతిలో ఓడిపోవడంతో సూపర్ 12కు చేరుకోవడానికి అవి చేమటోడాల్సిన పరిస్థితి నెలకొంది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ బీలోని వెస్టిండీస్, స్కాట్లండ్ మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను చిత్తుచేసి స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో సూపర్-12 దశకు పోటీలో ఉండాలంటే కచ్చితంగా రెండో మ్యాచ్ లో జింబాబ్వేపై నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.

తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో స్కాట్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు మొదటి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగలిగింది. బ్యాటర్ మున్సీ 53 బంతుల్లో 66 పరుగులతో చెలరేగిపోయాడు. నాటౌట్ గా నిలిచాడు.

161 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన విండీస్ కు స్కాట్లాండ్ బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 20 పరుగుల వద్ద ఓపెనర్ మేయర్స్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత లెవిన్ 14, బ్రాండన్ కింగ్ 17 పరుగులకే చేతులెత్తేశారు. కెప్టెన్ పూరన్ 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో 38 పరుగులతో విండీస్ లో ఆశలు చిగురింప చేసినా.. సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్ లో క్రిస్ గ్రీవ్స్ కు క్యాచ్ ఇచ్చాడు దీంతో.. 18.3 ఓవర్లలో 118 పరుగులకు విండీస్ ఆలౌట్ అయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

T20 world cup | తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. పసికూన నమీబియా చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News