Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsSania Mirza | లాస్ట్ మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి

Sania Mirza | లాస్ట్ మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి

Sania Mirza | ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్‌లో నిరాశే ఎదురైంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత సీనియర్‌ ఆటగాడు రోహాన్‌ బోపన్నతో కలిసి తిరుగులేని ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న సానియాకు ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. శుక్రవారం తెల్లవారుజామున రాడ్ లావర్ ఎరినాలో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జంట స్టెఫానీ – రఫెల్ చేతిలో 6-7, 2-6 తేడాతో ఓడిపోయింది. అంతుకుమందు మహిళల డబుల్స్‌లోనూ సానియాకు నిరాశే ఎదురైంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ గెలవాలన్న కల నెరవేరకుండానే వెనుదిరిగింది.

కెరీర్‌ ఆరంభం నుంచి దశాబ్ద కాలం పాటు సింగిల్స్‌, డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ.. క్రీడారంగంలో అద్భుతాలు చేసేందుకు మాతృత్వం అడ్డుకాదని నిరూపించింది. అంతర్జాతీయ స్థాయిలో సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌ (2007 ఆగస్టులో)కు చేరిన సానియా.. డబుల్స్‌ (2015)లో టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడేసి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కైవసం చేసుకుంది. కెరీర్ చివరి మ్యాచ్‌లో ఏడో ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్లూరినప్పటికీ బ్రెజిల్ జంట చేతిలో ఆమెకు నిరాశ తప్పలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mohemmad siraj | ధోనీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సిరాజ్‌

Shubman Gill | శుభ్‌మన్ గిల్ వీర విహారం.. 10 రోజుల్లోనే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News