Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsSA vs WI | ఒకే టీ20 మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. రికార్డుల మోత మోగిన...

SA vs WI | ఒకే టీ20 మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. రికార్డుల మోత మోగిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ పోరు

SA vs WI | టైమ్‌ 2 న్యూస్‌, సెంచూరియన్‌: రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు.. 46 ఫోర్లు, 35 సిక్సర్లు.. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 258 పరుగులు.. ఛేదనలో మరోజట్టు 259 పరుగులు ఇవన్నీ ఒక టీ20 మ్యాచ్‌లో సాధ్యమయ్యాయంటే నమ్మగలమా! కానీ నమ్మాల్సిందే. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 ఈ రికార్డులకు వేదికైంది. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకెక్కింది. విండీస్‌ యంగ్‌ గన్‌ జాన్సన్‌ చార్లెస్‌ సెంచరీతో చెలరేగితే.. సఫారీ ఓపెనర్‌ డికాక్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకులు ఇది లైవా.. లేక హైలెట్సా అని ఆశ్చర్యపోయేలా సాగిన పోరులో ఇరు జట్లు కలిపి 517 పరుగులు చేయడం విశేషం. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (46 బంతుల్లో 118; 10 ఫోర్లు, 11 సిక్సర్లు) అద్వితీయ శతకం నమోదు చేసుకోగా.. కైల్‌ మయేర్స్‌ (27 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. ఆఖర్లో పావెల్‌ (28), షెఫర్డ్‌ (41 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో విండీస్‌ భారీ స్కోరు చేసింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌ 3, వైన్‌ పార్నెల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

డికాక్‌ మెరుపులు

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కావడం గమనార్హం. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలిలా విరుచుకుపడగా.. రీజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచూరియన్‌లో సునామీ సృష్టించాడు. డికాక్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. భారీ లక్ష్యఛేదనలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి చేజింగ్‌ను సులువుగా మార్చేయగా.. చివర్లో కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (38 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. డికాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక పరుగలను ఛేదించిన దక్షిణాఫ్రికా.. ఇప్పుడు టీ20ల్లో అలాంటి ప్రదర్శనతోనే అదరగొట్టింది. తొలి బంతి నుంచే విశ్వరూపం కనబర్చి బౌండ్రీలతోనే సెంచరీ చేసిన చార్లెస్‌ పోరాటం బూడిదలో వేసిన పన్నీరైంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News