Home Sports RCB vs UPW | అయ్యో బెంగళూరు.. అటు ఐపీఎల్లో, ఇటు డబ్ల్యూపీఎల్‌ల్లోనూ అదే తంతు.....

RCB vs UPW | అయ్యో బెంగళూరు.. అటు ఐపీఎల్లో, ఇటు డబ్ల్యూపీఎల్‌ల్లోనూ అదే తంతు.. ఇలా అయితే ఎలా?

RCB vs UPW | టైమ్ 2 న్యూస్, ముంబై: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్నట్లు’.. నాణ్యమైన ప్లేయర్లు, మెరుగైన సహాయ సిబ్బంది, స్టార్ కెప్టెన్ ఇలా ఎన్ని ఉన్నా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత మాత్రం మారడం లేదు. ఇప్పటికే ఐపీఎల్లో భారి అపప్రద మూటగట్టుకున్న ఈ ఫ్రాంచైజీ.. తాజాగా డబ్ల్యూపీఎల్‌ల్లోనూ అదే బాటలో నడుస్తోంది. ఇప్పటి వరకు 15 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. అందులో ఒక్కసారి కూడా బెంగళూరు టైటిల్ గెలువలేకపోయింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడి ఒకరిని మించి ఒకరు ట్రోఫీలు చేజిక్కించుకుంటుంటే.. సుదీర్ఘ కాలం బెంగళూరుకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ మాత్రం తన జట్టును చాంపియన్‌గా నిలుపలేకపోయాడు. ఇప్పుడు అదే ఫ్రాంచైజీ యాజమాన్యం మహిళల ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూపీఎల్‌ )లో బెంగళూరు జట్టును కొనుగోలు చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనతో పాటు అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్, ఎలీసా పెర్రీ, హీతర్ నైట్, ఎరిన్ బర్న్స్ను ఎంపిక చేసుకుంది. యువ సంచలనం రిచా ఘోష్, రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, కనిక అహుజ వంటి వాళ్లను జట్టులో అవకాశమిచ్చినా బెంగళూరు రాత మాత్రం మారడం లేదు. బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్నింట్లోనూ ఓటమి పాలైంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌ తొలిసీజన్‌లో ఇక రాయల్ చాలెంజర్స్ ముందంజ వేయాలంటే అద్భుతం జరుగాల్సిందే.

అలీసా హీలీ షో..

ఇప్పటికే లీగ్‌లో మూడు మ్యాచ్లు ఓడిన బెంగళూరు.. శుక్రవారం జరిగిన పోరులో యూపీ వారియర్స్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అలీసా పెర్రీ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం సాధించగా.. సోఫియా డివైన్ (36) రాణించింది. కెప్టెన్ స్మృతి మంధన (4), కనిక అహుజ (8), హీథర్ నైట్ (2), శ్రేయాంక (15), బర్న్స్ (12), రిచా ఘోష్ (1) విపలమయ్యారు. ఒక్కరు కూడా కనీస ప్రతిఘటన కనబర్చలేకపోవడంతో బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా ఎకెల్స్టోన్ 4, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది. కెప్టెన్ అలీసా హీలీ (47 బంతుల్లో 96 నాటౌట్; 18 ఫోర్లు, ఒక సిక్సర్) విశ్వరూపం కనబర్చగా.. దేవిక వైద్య (36 నాటౌట్; 5 ఫోర్లు) సత్తాచాటింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version