Home Sports RCB vs GG | సోఫియా సుడిగాలి ఇన్నింగ్స్.. బెంగళూరుకు రెండో విజయం

RCB vs GG | సోఫియా సుడిగాలి ఇన్నింగ్స్.. బెంగళూరుకు రెండో విజయం

RCB vs GG | టైమ్ 2 న్యూస్, ముంబై: ఓపెనింగ్ బ్యాటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. లారా వాల్వర్ట్ (68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సోఫియా సునామీని తలపించింది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా విజృంభించిన సోఫియా ఒక్క పరుగు తేడాతో డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ చాన్స్ మిస్ చేసుకుంది. కెప్టెన్ స్మృతి మందన (37) పర్వాలేదనిపించింది.

కోహ్లీ ఇచ్చిన టానిక్‌తో

గత మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ.. బెంగళూరు జట్టుతో ప్రత్యేకంగా ముచ్చటించగా.. కింగ్ మాటల నుంచి స్ఫూర్తి పొందిన అమ్మాయిలు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకున్నారు. 15 ఏళ్లుగా ఐపీఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయాడు. ఇదే విషయాన్ని స్మృతి మంధన బృందంతో పంచుకున్న కోహ్లీ.. అయినా తానెప్పుడూ నిరాశకు లోను కాలేదని వారిలో స్ఫూర్తి నింపాడు. పరాజయాలు ఎదురయ్యాయని బాధపడకుండా.. ముందుకు సాగాలని తెగించి ఆడితే విజయం తథ్యమని విరాట్.. మహిళలకు హితబోధ చేశాడు. అతడి మాటల నుంచి స్ఫూర్తి పొందిన అమ్మాయిలు.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లిన అనంతరం వరుసగా రెండో గెలుపు నమోదు చేసుకున్నారు.

ముంబై తొలి పరాజయం

మరోవైపు ముంబై ఇండియన్స్‌కు డబ్ల్యూపీఎల్‌లో తొలి పరాజయం ఎదురైంది. ఐదు విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ముంబై శనివారం తొలి పోరులో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (35), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (25), ఇస్ వాంగ్ (32) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో ఎకెల్స్టోన్ 3, దీప్తి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 రన్స్ చేసింది. గ్రేస్ హారిస్ (39), తహిలా (38) రాణించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version