Home Latest News KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

Image Source: KL Rahul Instagram

KL Rahul | టైమ్‌ టు న్యూస్‌, కోల్‌కతా: మిడిలార్డర్‌లో అనుభవరాహిత్యాన్ని దూరం చేసేందుకే.. జట్టు యాజమాన్యం తనను ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని సూచించిందని లోకేశ్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. శ్రీలంకతో రెండో వన్డేలో కీలక అర్ధశతకం సాధించిన రాహుల్‌.. అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బౌలర్లకు సహకరించడంతో పరుగులు చేయడం కష్టమైన తరుణంలో రాహుల్‌ ఓపికగా క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతంలో కెప్టన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌.. ప్రస్తుతం జట్టు అవసరాల దృష్ట్యా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మహేంద్రసింగ్‌ ధోనీ వంటి అనుభవజ్ఞుడు మిడిలార్డర్‌లో ఉన్నంత కాలం టీమ్‌ఇండియాకు పెద్దగా ఇబ్బంది లేకపోగా.. మహీ రిటైర్మెంట్‌ అనంతరం చివరి వరకు నిలిచి జట్టుకు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేవాళ్లు కరువయ్యారు. దీంతో మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ను మిడిలార్డర్‌కు మార్చింది.

డబుల్‌ రోల్‌

ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నానని రాహుల్‌ పేర్కొన్నాడు. రెండో వన్డే అనంతరం మాట్లాడుతూ.. ‘మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాట్‌ మీదకు బంతి వస్తుంటే ఇబ్బందేముంటుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగడం వల్ల నా ఆటను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నా. క్రీజులో అడుగుపెట్టకముందే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది కాబట్టి.. అది బ్యాటింగ్‌ శైలికి తోడ్పడుతుంది’ అని అన్నాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనపై నమ్మకముంచి మిడిలార్డర్‌లో ఆడమని సూచించినట్లు రాహుల్‌ పేర్కొన్నాడు. ‘రోహిత్‌ నా విషయంలో స్పష్టతతో ఉన్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని సూచించాడు. జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’ అని అన్నాడు. వన్డేల్లో వికెట్‌ కీపర్‌గానూ కొనసాగుతున్న రాహుల్‌కు.. అది కూడా బ్యాటింగ్‌ మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతుందని సీనియర్లు అంటున్నారు. వికెట్ల వెనుక బంతిని నిశితంగా పరిశీలించే అలవాటు ఉండటంతో.. అది బ్యాటింగ్‌ సమయంలో సహకరిస్తుందని అంటున్నారు.

టార్గెట్‌ బట్టే షాట్లు..

లక్ష్యాన్ని బట్టే.. షాట్ల ఎంపిక ఉంటుందని రాహుల్‌ అన్నాడు. కోల్‌కతా పోరులో మరీ నెమ్మదిగా ఆడిన రాహుల్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘టార్గెట్‌ ఎక్కువ లేకపోవడంతో నిధానంగా బ్యాటింగ్‌ చేశా. ఈడెన్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉందని చెప్పను కానీ.. లంక చేసిన స్కోరుకంటే ఎక్కువ పరుగులే నమోదవుతాయని అనుకున్నా. అయితే లక్ష్యఛేదనలో నాలుగు వికెట్లు త్వరగానే పడటంతో కాస్త నెమ్మదిగా ఆడా. సాధించాల్సిన స్కోరు ఎక్కువ లేనప్పుడు రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా చక్కటి సహకారం అందించడంతో ధాటిగా ఆడాల్సిన అవసరం పడలేదు. ఒకవేళ టార్గెట్‌ ఎక్కువ ఉంటే ఇంకా వేగంగా పరుగులు చేసుండేవాడిని’ అని పేర్కొన్నాడు.

తాను టీమ్‌ ప్లేయర్‌నని.. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ప్రతి ఒక్కరికీ ముఖ్యమని వెల్లడించాడు. ‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎవరికైనా గర్వకారణమే. విపరీతమైన పోటీ ఉన్న భారత తుది జట్టులో చోటు దక్కించుకోవడమే పెద్ద పని. ఇక ఏ స్థానంలో ఆడాలనేదేం లేదు. టీమ్‌ ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉంటా’ అని అన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

India Vs Sri Lanka | సిరీస్‌ మనదే.. మెరిసిన మిడిలార్డర్‌.. శ్రీలంకపై భారత్‌ విక్టరీ

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

Virat Kohli Daughter | కూతురితో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్న విరాట్, అనుష్క శర్మ.. ఈసారి కూడా అదే ట్విస్ట్

Exit mobile version