Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsIndia vs Srilanka | తొలి టీ20లో శ్రీలంకపై భారత్‌ విజయం.. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన...

India vs Srilanka | తొలి టీ20లో శ్రీలంకపై భారత్‌ విజయం.. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన శివమ్ మావి

India vs Srilanka | ముంబై వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి 20లో భారత్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న శివమ్‌ మావి ముచ్చెమటలు పట్టించాడు. అద్భుత ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తాను వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్‌ నిస్సాంకను ఔట్‌ చేశాడు. రెండో ఓవర్లో దనంజయను ఔట్‌ చేశాడు. దీంతో లంకకు కష్టాలు మొదలయ్యాయి.

అయితే చివర్లో హసరంగ, శనక దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో మరోసారి విజృంభించిన శివమ్‌ మావి మరోసారి బంతితో మాయ చేశాడు. హసరంగను ఔట్‌ చేశాడు. తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. 17వ ఓవర్లో తీక్షణను మావి ఔట్‌ చేసి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 19 ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ 16 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్‌లో లంక విజయానికి 13 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు.

తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ ఎంచుకుంది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. దీపక్‌ హుడా ( 40 పరుగులు ) , అక్షర్‌ పటేల్ ( 31 పరుగులు) దూకుడుగా ఆడటంతో భారీ స్కోరు చేయగలిగింది. మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది. తొలి టీ20 ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ 7 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అటు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా 7 పరుగులకే ఔటయి నిరాశపరిచాడు. సంజూశాంసన్‌ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ 37 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌, అక్షర్ పటేల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

India vs Srilanka | తొలి టీ20లో శ్రీలంక విజయలక్ష్యం 163 పరుగులు.. దూకుడుగా ఆడిన హుడా, అక్షర్‌

Team India Schedule | కొత్త ఏడాది అయినా టీమిండియాకు కలిసొచ్చేనా? 2023 షెడ్యూల్ ఇదే

Rishab pant health update | పంత్‌ కోలుకునేందుకు ఆరు నెలలు పట్టొచ్చు.. టీమిండియా క్రికెటర్‌ హెల్త్‌పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన వైద్యులు

Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News