Home Latest News India Vs New Zealand | న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 386 పరుగులు.. సెంచరీలతో చెలరేగిన రోహిత్‌...

India Vs New Zealand | న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 386 పరుగులు.. సెంచరీలతో చెలరేగిన రోహిత్‌ శర్మ, గిల్‌

Image Source: Indian Cricket Team Facebook

India Vs New Zealand | న్యూజిలాండ్‌తో ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. రోహిత్‌ శర్మ 83 బంతుల్లో సెంచరీ చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ 72 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వీరిద్దరూ 26 ఓవర్లలో తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ స్కోరు 400 పరుగులు దాటుతుందని అనుకున్నారు. అయితే ఓపెనర్లు మినహా టాప్‌ ఆర్డర్‌ అంతా విఫలమవడంతో 385 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంచరీ చేసిన వెంటనే రోహిత్‌ శర్మ 101 పరుగుల వ్యక్తిగత వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే గిల్‌ కూడా 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

క్రీజులోకి వచ్చిన కోహ్లీ 36, ఇషాన్‌ 17 పరుగులకే ఔటయ్యారు. భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడనుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా 14 పరుగులకే పెవిలియన్‌ చేరి నిరాశపరిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ కూడా 9 పరుగులకే ఔటయ్యాడు. 212 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌ మరో వంద పరుగులు చేసి కీలకమైన 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, గిల్‌ మినహా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో హార్దిక్‌ పాండ్యా అర్థ శతకం చేసి.. 54 పరుగులకు ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కూడా 25 పరుగులకే ఔటయ్యాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫ్పీ, బ్లెయిర్‌ తిక్నర్‌ చెరో మూడు వికెట్లు తీశారు. మైకెల్‌ బ్రాస్‌వెల్‌ ఒక వికెట్‌ తీశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ravindra Jadeja | జడ్డూ పునరాగమనం.. ఆర్నెళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్న రవీంద్ర జడేజా.. అరవంలో ట్వీట్‌

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Vijay devarakonda | బ్లాక్‌హాక్స్‌ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

ICC Rankings | అగ్రస్థానానికి అడుగుదూరంలో భారత్‌ .. మూడో వన్డే నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ మనదే

Exit mobile version