Home Latest News Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Image Source: Hockey India Facebook

Hockey World Cup | టైమ్‌2న్యూస్‌, భువనేశ్వర్‌: ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. వరుసగా రెండోసారి స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా బోణీ కొట్టింది. రూర్కేలాలో నూతనంగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి పోరులో భారత్‌ 2-0తో స్పెయిన్‌పై అద్వితీయ విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరుతో విజృంభించిన టీమ్‌ఇండియాకు స్పెయిన్‌ బదులు చెప్పలేకపోయింది. లోకల్‌ బాయ్‌ అమిత్‌ రొహిదాస్‌ 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా.. 26వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ ఫీల్డ్‌గోల్‌తో భారత ఆధిక్యాన్ని డబుల్‌ చేశాడు. గ్రూప్‌-‘డి’లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చక్కటి ప్రదర్శన కనబర్చిన హర్మన్‌ప్రీత్‌ సేన.. క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలను మెరుగు పర్చుకుంది. మొత్తం మ్యాచ్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు దక్కగా.. వాటిలో ఒకదాన్ని సద్వినియోగం చేసుకోగలిగింది.

ఒకప్పుడు హాకీ ప్రపంచాన్ని ఏలిన భారత్‌.. ఎనిమిది ఒలింపిక్‌ స్వర్ణాలు సాధించి భళా అనిపించగా.. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మన ప్రభ తగ్గింది. అయితే ఇటీవలి కాలంలో తిరిగి ఊపందుకున్న హాకీకి.. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతకం నూతన జవసత్వాలు నింపింది. ఇక అక్కడి నుంచి ఆడిన ప్రతి టోర్నీలో రాణిస్తూ వస్తున్న భారత జట్టు.. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టింది. కప్పు గెలిస్తే ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తానని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే ప్రకటించగా.. మ్యాచ్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు ప్లేయర్లకు తలా పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్న అమిత్‌ రొహిదాస్‌.. శుక్రవారం స్పెయిన్‌తో పోరులో విజృంభించాడు. మైదానంలో ఉన్నంతసేపు ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన అమిత్‌.. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. సాధారణంగా అటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థిని ఇరుకున పెట్టే స్పెయిన్‌ ఈ మ్యాచ్‌లో భారత జోరుతో డిఫెన్స్‌లో పడింది. ఎంత ప్రయత్నించినా.. భారత రక్షణ శ్రేణిని ఛేదించి ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

India Vs Sri Lanka | సిరీస్‌ మనదే.. మెరిసిన మిడిలార్డర్‌.. శ్రీలంకపై భారత్‌ విక్టరీ

Exit mobile version