Thursday, September 21, 2023
- Advertisment -
HomeLatest NewsIPL 2023 | తమన్నా ‘ఊ అంటావా మామ’.. రష్మిక ‘నాటు నాటు’.. అట్టహాసంగా ఐపీఎల్‌...

IPL 2023 | తమన్నా ‘ఊ అంటావా మామ’.. రష్మిక ‘నాటు నాటు’.. అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు

IPL 2023 | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌ ఆట్టహాసంగా ప్రారంభమైంది. గత పదిహేనేళ్లుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్‌.. ఈ సారి కొత్త నిబంధనలతో సరికొత్తగా ప్రారంభమైంది. సీజన్‌ తొలి పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడగా.. లీగ్‌ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి.

దుమ్మురేపిన తమన్నా..

బాలివుడ్‌ సింగర్‌ అర్పిత్‌ సింగ్‌ మ్యూజిక్‌ షోతో ప్రారంభమైన ఆరంభ వేడుకల్లో సినీ తారాలు సందడి చేశారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మిక మంధన తమ ఆట పాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో ప్రత్యేక వేదిక మీదకు వచ్చిన తమన్నా.. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’’ సాంగ్‌కు అదిరే స్టెప్స్‌ వేసి స్టేడియాన్ని హోరెత్తించింది. ఆ తర్వాత తమిళ, హింది సహా ఇతర భాషల పాటలకు చిందులు వేసింది.

‘శ్రీ వల్లి’.. సామీ, సామీ

కాసేపటికి వేదికపైకి వచ్చిన రష్మిక మంధన… పుష్పలోని సామీ సామీ పాటకు డాన్స్‌ చేసింది. తన ట్రేడ్‌ మార్క్‌ స్టెప్‌తో రష్మిక స్టేడియాన్ని హోరెత్తించింది. దీంతో పాటు శ్రీ వల్లి పాట హిందీ వర్షన్‌కు రష్మిక కాలు కదిపింది. దీంతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఆస్కార్‌ సాంగ్‌ ‘నాటు నాటు’కు రష్మిక తనదైన స్టెప్పులు వేసింది. ఇదిలా ఉంటే మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ మ్యాచ్‌కు ముందు కామెంటేటర్‌ అవతారమెత్తి అలరించారు.

బీసీసీఐ పెద్దల సమక్షంలో..

ప్రత్యేక కార్యక్రమాల అనంతరం హోస్ట్‌ మందిరా బేడీ.. బీసీసీఐ పెద్దలను స్టేజ్‌ మీదకు ఆహ్వానించగా.. వారు ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్‌-16వ సీజన్‌ తొలి పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌కు దిగింది. సాయంత్రం ఐదింటికి ముందే అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి తరలివచ్చారు. గత మూడేళ్లుగా ఎలాంటి ఆరంభ వేడుకలు నిర్వహించకుండా.. నేరుగా మ్యాచ్‌లు జరుపగా.. ఈ సారి మాత్రం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Srilanka | శ్రీలంకకు ఘోర అవమానం.. 44 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయిన లంక

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News