Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | ఒకే రోజు రెండు మ్యాచులు వర్షార్పణం.. మినీ యాషెస్‌, అఫ్గాన్-...

T20 world cup | ఒకే రోజు రెండు మ్యాచులు వర్షార్పణం.. మినీ యాషెస్‌, అఫ్గాన్- ఐర్లాండ్‌ మ్యాచ్‌ల రద్దు

T20 world cup | పొట్టి ప్రపంచకప్‌లో వరుణుడు కూడా ఓ ఆటాడుకుంటున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ 12లో భాగంగా అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు కూడా అప్గాన్‌, న్యూజీలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వరుణిడి వల్ల రద్దైంది. అఫ్గాన్ ఆడాల్సిన రెండు మ్యాచులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆటగాళ్లు నిరాశచెందుతున్నారు. ఈ రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది.

Read more: Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

మరోవైపు గ్రూప్ 1లో ఇంగ్లాండ్‌ ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైంది. మినీ యాషెస్‌గా పిలుచుకునే ఈ మ్యాచ్‌ కూడా రద్దు కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే కీలకమైన రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫెండింగ్‌ ఛాంపియన్ అయిన్ ఆసిస్‌ను తొలి మ్యాచ్‌లోనే కివీస్‌ షాకిచ్చింది. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌ పుంజుకుంది. లంకపై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌పై గెలిచి సెమీస్‌ ఆశలు మెరుగు పరుచుకుందానుకుంటే వరుణుడు అంతరాయం కలిగించాడు.

Read more: Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

అటు ఇంగ్లాండ్‌ది కూడా సేమ్‌ పరిస్థితి. తొలి మ్యాచ్ లో అప్గానిస్థాన్‌ను ఓడించినా..రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారడంతో మూడు పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం గ్రూప్‌ 1లో అఫ్గాన్‌ మూడు మ్యాచులు ఆడగా.. రెండు రద్దయ్యాయి. ఒకదాంట్లో ఓడిపోయింది. దీంతో పాయిట్ల పట్టికలో రెండు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్‌ మూడు మ్యాచుల్లో ఒకటి గెలవగా..మరోటి ఓడిపోయింది. ఇంకో మ్యాచ్‌ రద్దైంది. దీంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

Follow Us : FacebookTwitter

Read more articles | Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News