Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsLionel Messi | ధోనీ కూతురికి మెస్సీ స్పెషల్‌ గిఫ్ట్‌.. అది చూసి మురిసిపోతున్న జీవా

Lionel Messi | ధోనీ కూతురికి మెస్సీ స్పెషల్‌ గిఫ్ట్‌.. అది చూసి మురిసిపోతున్న జీవా

Lionel Messi | భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ముద్దుల కూతురికి అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్ మెస్సీ ఊహించని బహుమతి పంపించాడు. ఫిఫా వరల్డ్‌ కప్‌ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మెస్సీ తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీలను బహుమతులుగా పంపిస్తున్నాడు.

అందులో భాగంగా ధోనీ కూతురు జీవాకు కూడా మెస్సీ తన సంతకంతో కూడిన జెర్సీని పంపించి ఆశ్చర్యపరిచాడు. జెర్సీ మీద ఫర్‌ జీవా, తండ్రి లాంటి కూతురు, కామన్‌ లవ్‌, మేరీ క్రిస్మస్‌ అని రాసి సంతకం పెట్టి మరి పంపించాడు మెస్సీ. అది చూసిన ధోనీ కూతురు జీవా సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. మెస్పీ పంపించిన జెర్సీని ధరించిన జీవా తెగ సంబరపడిపోయింది. ఇప్పుడీ ఫొటోలను జీవా సింగ్‌ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

ధోనీ కూతురు జీవాకు మెస్సీ స్పెషల్‌గా బహుమతి పంపించడానికి ఓ కారణం ఉంది. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనల్ మెస్సీకి మహేంద్ర సింగ్‌ ధోనీ పెద్ద అభిమాని. ఈ విషయం తెలుసుకున్న మెస్సీ తన జెర్సీని ధోనీ కూతురు జీవాకు పంపించి ఇద్దరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతకుముందు మెస్సీ తన సంతకంతో కూడిన జెర్సీని బీసీసీఐ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కుమారుడు జైషాకు పంపించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cristiano Ronaldo | రొనాల్డోకు రోల్స్ రాయల్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియసి.. కారణం ఏంటంటే..

Nikhat Zareen | తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఖాతాలో మరో టైటిల్..

David Warner Double century | మూడేళ్ల తర్వాత సెంచరీ దాహం.. వందో టెస్టులో డేవిడ్ వార్నర్ డబుల్ ధమాకా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News