Home Latest News WPL 2023 | మహిళల ఐపీఎల్ టైటిల్ హక్కులు కూడా ఆ కంపెనీకే !!.. బీసీసీఐ...

WPL 2023 | మహిళల ఐపీఎల్ టైటిల్ హక్కులు కూడా ఆ కంపెనీకే !!.. బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక ప్రకటన

WPL 2023 | ఇన్నాళ్లు ఐండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న టాటా గ్రూప్‌ తాజాగా ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్ ( డబ్ల్యూపీఎల్) కు కూడా టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ, టాటా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి ఈ హక్కుల డీల్ కుదిరిందని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

‘ప్రారంభ డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్ ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. టాటా గ్రూప్ సపోర్టుతో మహిళా క్రికెట్‌ను తర్వాత స్థాయికి తీసుకెళ్లగలమని విశ్వసిస్తున్నాం’ అని జైషా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ డబ్ల్యూపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడనుండగా.. ఈ మ్యాచ్‌లను వయాకామ్ 18 ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ ఆ హక్కుల్ని అమ్మేసింది. అలానే టోర్నీలో పోటీపడే ఐదు ఫ్రాంఛైజీలను టాప్ బిజినెస్ హౌసెస్‌కి అమ్మడం ద్వారా బీసీసీఐ ఇప్పటికే రూ.4670 కోట్లు ఆర్జించిన విషయం తెలిసిందే.

ఇటీవల డబ్ల్యూపీఎల్ వేలం కూడా ముగియగా.. అందులో ఈ ఐదు ఫ్రాంఛైజీలు కలిపి 87 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోలు కోసం ఫ్రాంఛైజీలు అన్నీ కలిపి సుమారు రూ.59.5 కోట్లని ఖర్చు చేశాయి. భారత ఓపెనర్ స్మృతి మంధన్నా అత్యధిక ధర రూ.3.4 కోట్లు పలకగా.. వేలంలో స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ దక్కించుకుంది.

డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో పోటీపడే జట్లు ఇవే

  1. ముంబయి ఇండియన్స్
  2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  3. ఢిల్లీ క్యాపిటల్స్
  4. గుజరాత్ జెయింట్స్
  5. యూపీ వారియర్స్

మార్చి 4నుంచి మొదలయ్యే డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్ మ్యాచ్ లను ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియాల రెండు వేదికలపై నిర్వహించనున్నారు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను బ్యాకప్ గా ఎంపికచేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Exit mobile version