Saturday, January 28, 2023
- Advertisment -
HomeLatest NewsYS Sharmila | వైఎస్ వివేకా హత్యకేసులో నిజానిజాలు తేల్చాలి.. దోషులను శిక్షించాలి.. వైఎస్ షర్మిల...

YS Sharmila | వైఎస్ వివేకా హత్యకేసులో నిజానిజాలు తేల్చాలి.. దోషులను శిక్షించాలి.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్

YS Sharmila | వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. ఒక ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణకు ఇన్ని సంవత్సరాలు పడితే.. సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ఆలస్యం పై ఆమె మండిపడ్డారు.

ఇంత ఆలస్యం చేస్తే సీబీఐ పై నమ్మకం ఉంటుందా అని ఆమె అన్నారు. ఇప్పటికైనా వైఎస్ వివేకా హత్య కేసులో నిజా నిజాలు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం విచారణ ఫైల్స్‌ తో పాటు వాంగ్ములాల రికార్డులు అన్ని హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడ్డాయి. దీనికి సంబంధించిన ఫైళ్లు, ఛార్జీషీటు పత్రాలు, సాక్షుల వాంగ్ములాలు, కీలక డాక్యుమెంట్లు మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. కడప జిల్లా సెషన్స్‌ కోర్టు నుంచి సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి.

కాగా వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడం పై వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి స్పందించారు.ఒకరోజు ముందుగా నోటీసులు పంపారని, ముందుగా వేరే కార్యక్రమాలను పెట్టుకోవడంతో ఇప్పుడు రాలేనని సీబీఐకి లేఖ రాశారు. ఐదు రోజుల తరువాత ఎప్పుడూ పిలిచినా దర్యాప్తునకు వస్తానని చెప్పారు. సీబీఐ వారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తానని అన్నారు. అవినాష్‌ రెడ్డి ఇంటి వద్ద లేకపోవడంతో ఆయనకు సీబీఐ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు.

నా పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర

ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద పొరపాటు చేశాడని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పాదయాత్ర ఎక్కడ అడ్డుకున్నారో అక్కడి నుంచే ఈ నెల 28వ తేదీన రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ మొదలు పెడతానని ఆమె స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని విమర్శించారు. 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఎందుకు?

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News