Home News AP Kotamreddy Sridhar Reddy | ముందు నీ మీద ఉన్న కేసుల సంగతి చూసుకో.. కాకాణిపై...

Kotamreddy Sridhar Reddy | ముందు నీ మీద ఉన్న కేసుల సంగతి చూసుకో.. కాకాణిపై కోటంరెడ్డి ఫైర్!

Image Source: Kotamreddy sridhar Reddy Facebook

Kotamreddy Sridhar Reddy | అధికార వైసీపీలో కోటంరెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఏరోజు ఎప్పుడు ఎవరి మీద పడతారో తెలియక అందరూ హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాకాణి గోవర్ధన్‌కి శనివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను కూడా సెటైరికల్‌గా మాట్లాడగలనని, కానీ రాజకీయ నాయకులకు అంతకు మించి ప్రజా శ్రేయస్సు ముఖ్యం అని, తాను అందుకోసమే కృషి చేస్తామన్నారు.

బావా కాకాణి.. ముందు నీ మీద ఉన్న కేసు సంగతి చూసుకోవాలని హితవు పలికారు. కోర్టులో ఎన్నో రకాల పత్రాలుంటాయి.. కానీ కాకాణి కేసు పత్రాలు మాత్రమే ఎందుకు మిస్సయ్యాయని ఆయన ప్రశ్నించారు. జగన్‌ విషయంలో నా బావ కాకాణి తనపై ఘాటు విమర్శలు చేయలేదని, కానీ ఆయన సజ్జలను అన్నందుకు ఆయన ఎక్కువ ఫీల్‌ అయ్యారు. రామకృష్ణారెడ్డి పేరెత్తితేనే కాకాణి ఉలిక్కిపడ్డారని చెప్పారు.

ఎందుకంటే సజ్జలే.. కాకాణికి మంత్రి పదవి ఇప్పించారని, వారిద్దరి మధ్య లావాదేవీలున్నాయని ఆయన విమర్శించారు. అందుకే సజ్జలని అంటే కాకాణికి కోపం వస్తుందని ఎద్దేవా చేశారు. నాకు ఇంతకు ముందు నెల్లూరు నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చేవి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కాల్స్‌ వస్తున్నాయని, కొందరు బెదిరించడానికే కాల్స్ చేస్తున్నారు. అందులో బోరుగడ్డ అనిల్‌ వ్యక్తి ఉన్నారు. ఆయన రికార్డ్ చేసిన ఆ వాయిస్‌ బయటకొచ్చిందని వివరించారు.

ఈ క్రమంలోనే సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ వెనుక సజ్జల కచ్చితంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. సజ్జలకి ఇదే నా వార్నింగ్‌…. నాకు ఇలానే బెదిరింపు కాల్స్ వస్తే రూరల్‌ నియోజకవర్గం నుంచి సజ్జలకు వీడియో కాల్స్ వస్తాయని చెప్పారు. సజ్జల వాటికి నువ్వు తట్టుకోలేవు. సజ్జలకు ఇలాంటి అలవాటు ఉందని, ఆయన కోటరీ నుంచే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా పేర్కొన్నారు.

నా మీద దొంగ కేసులు పెట్టాలనుకున్నప్పుడు ఒక్క కేసుతో వదిలి పెట్టవద్దు. అన్ని రకాలు కేసులు పెట్టుకోండి. నేను ఏ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి బెదిరించలేదు.. అలా చేస్తే ఎవరూ బెదిరిపోరు, అనుబంధంతోనే ఎవరైనా తమతో ఉండాలన్నారు. విజయ భాస్కర్ రెడ్డి అనే కార్పొరేటర్‌ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ గెలిపించాను. కానీ చివరికీ ఆయన కూడా ఏరు దాటాక తెప్ప తగలేశాడు అంటూ విరుచుకుపడ్డారు. తనతోపాటు ఎంతమంది కార్పొరేటర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉంటారో తెలియదు కానీ కార్యకర్తలు మాత్రం తనతోనే ఉంటారని చెప్పుకొచ్చారు.

కార్యకర్తలంతా తనతోపాటే ఉన్నారన్నారు. కార్పొరేటర్లు మాత్రం తమకు బిల్లులు రావాలని చెబుతున్నారని, వారిని తాను ఇబ్బంది పెట్టబోనన్నారు కోటంరెడ్డి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

Kotamreddy Sridhar Reddy | నన్ను ఎన్‌కౌంటర్ చేస్తేనే నా గొంతు ఆగుతుంది.. జగన్‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

Exit mobile version