Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsAmit Shah | ప్రధాని అవ్వడం కాదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో.. కేసీఆర్‌పై...

Amit Shah | ప్రధాని అవ్వడం కాదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో.. కేసీఆర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా విమర్శలు

Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( CM KCR )పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పేరుతో దేశమంతా విస్తరించాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని.. దీనికోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని.. కానీ ప్రధాని సీటు ఖాళీగా లేదని ఆయన తెలుసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి అవుతారని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రధాని అవ్వడం తర్వాత ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ప్రజల నుంచి కేసీఆర్ దూరం చేయలేరని స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంట్ యోజనలో భాగంగా వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. మజ్లిస్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదని అన్నారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ( TSPSC ) పేపర్లు లీకవుతున్నా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడట్లేదని.. యువకుల జీవితాలను సీఎం అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడమే కాకుండా.. లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని అన్నారు. కానీ 24 గంటల్లోనే బండి సంజయ్‌ ( Bandi Sanjay )కు బెయిల్ వచ్చిందని తెలిపారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వాళ్లకు సాధ్యపడలేదని విమర్శించారు. జైలుకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తమ కార్యకర్తలు విశ్రమించదని అన్నారు.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News