Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsAPKodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు...

Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన

Kodi pandalu | ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ రోజే కోడికత్తికి ఇద్దరు బలయ్యారు. సరదాగా కోడి పందాలు చూడటానికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే కోడి కత్తికి పూసిన పాదరసం వల్లే ప్రాణాలు కోల్పోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు నల్లజర్ల మండల పరిధిలోని అనంతపల్లికి చెందిన పద్మారావు అనే యువకుడు స్థానికంగా జరుగుతున్న కోడిపందాలు చూడటానికి వెళ్లాడు. ఈ క్రమంలో బరిలో కత్తులు కట్టిన కోళ్లు కొట్లాడుతూ యువకుడి వైపు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో పద్మారావు మోకాలి వెనుక భాగంలో కోడి కత్తి గుచ్చుకుని.. కాలును బలంగా చీల్చింది. దీంతో తీవ్ర రక్త స్త్రావమైంది. వెంటనే అప్రమత్తమైన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మరో ఘటనలో కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం వేలం గ్రామంలో గండే ప్రకాశ్ అనే యువకుడు ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో జరుగుతున్న కోడి పందాలు చూడటానికి వెళ్లిన ప్రకాశ్ వైపు కోళ్లు దూసుకొచ్చాయి. కోళ్లకు ఉన్న కత్తి.. ప్రకాశ్ కాలికి గుచ్చుకుంది. దీంతో రక్తమోడుతూ కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే కోడి కత్తులకు విషపూరితమైన పాదరసం పూయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాదరసం వల్లే ప్రాణాలు కోల్పోయారా అనే విషయాలు పోస్టుమార్టం నివేదికలో తేలనున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

Twitter | ఇకపై ఎంత పెద్ద సైజు ట్వీట్స్ అయినా చేయవచ్చు.. ట్విట్టర్‌లో భారీ మార్పులు ప్రకటించిన ఎలన్ మస్క్

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News