Home Latest News TSRTC | ఆర్టీసీ బస్సు ఎక్కడుందో ఇలా మీ మొబైల్‌లోనే ట్రాక్ చేయవచ్చు

TSRTC | ఆర్టీసీ బస్సు ఎక్కడుందో ఇలా మీ మొబైల్‌లోనే ట్రాక్ చేయవచ్చు

TSRTC | ఆర్టీసీ బస్సుల్లో వెళ్దామంటే చాలామందికి ఒక్కటే సమస్యగా అనిపిస్తుంది. అసలు బస్సు ఎక్కడుంది? టైమ్‌కి వస్తుందా? బస్టాప్‌కి రావడానికి ఎంత సమయం పడుతుంది? అనేవి తెలియదు. ఆర్టీసీ అధికారులను అడిగితే ‘ వస్తుంది ‘ అని చెబుతారు. అది పది నిమిషాల్లో వస్తుందా? గంట పడుతుందా? అనేది తెలియదు. దీంతో బస్సు కోసం ఎదురుచూపులతో పుణ్యకాలం గడిచిపోతుంది. ఇకపై అలాంటి టెన్షన్ లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కడుందో ప్రతి క్షణం ట్రాక్ చేసేయొచ్చు. ఈ దిశగా టీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

బస్సులు ఎక్కడున్నాయో ట్రాక్ చేసేందుకు మెట్రో బస్సులకు అప్పట్లో జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. కానీ కరోనా రావడంతో దీన్ని అమల్లోకి తీసుకురావడం కుదరలేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల్లో మాత్రం దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ట్రాకింగ్ తీసుకొచ్చిన తర్వాత ఆ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో సిటీ బస్సుల్లోనూ దీన్ని అమలు చేసి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. ముందు మెట్రో బస్సుల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి వెల్లడించారు.

ఈ ట్రాకింగ్ సిస్టమ్ కోసం గ్రేటర్ హైదరాబాద్ సిటీ బస్సు అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ఓపెన్ చేసి మనం ఎక్కడ ఉన్నాం.. ఏ రూట్‌లో వెళ్లాలనే వివరాలు ఎంట్రీ చేయాలి. అప్పుడు ఆ రూట్‌లో నడిచే బస్సుల వివరాలు, అవి ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని చూపిస్తుంది. దాని ఆధారంగా బస్సు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Aravind Kejriwal | ఖమ్మం సభలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

Aishwarya Rai bachchan | బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌కి నోటీసులు.. 10 రోజుల్లో పన్ను బకాయిలు చెల్లించాలన్న అధికారులు

CM KCR | బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు

IT Rides | హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్.. ఈసారి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లపై!

Exit mobile version