Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsTS EAMCET | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే.

TS EAMCET | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే.

TS EAMCET | తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీలు మారాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఈ పరీక్షలు ఐదు రోజుల తర్వాతకు వాయిదా పడ్డాయి. అంటే మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు మే 12 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన విడుదల చేసింది.

మే 7వ తేదీన నీట్ పరీక్ష అలాగే మే 7, 8, 9వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మాత్రం యథావిధిగా ముందు నిర్ణయించినట్టుగా మే 10, 11వ తేదీల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News