Home Entertainment Samantha | అసలు నాకు మంచి రోజులొస్తాయా? అని రోజూ బాధపడేదాన్ని.. ఎమోషనల్ అయిన సమంత

Samantha | అసలు నాకు మంచి రోజులొస్తాయా? అని రోజూ బాధపడేదాన్ని.. ఎమోషనల్ అయిన సమంత

Image Source : Twitter/Samantha

Samantha | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో బాధలు అనుభవించింది. వాటి నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలోనే అనారోగ్యానికి గురైంది. మయోసైటిస్ కారణంగా చిన్న పని కూడా చేయలేని నిస్సహాయ స్థితికి చేరింది. దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నా సమంత మాత్రం చెక్కుచెదరలేదు. ధైర్యంగా ఉంటూ అన్నింటిపై పోరాడింది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌తో పోరాడి కోలుకుంది. మళ్లీ ఎప్పటిలా తన కెరీర్‌లో బిజీ అయ్యింది. అందుకే సమంతను చూసిన ఫ్యాన్స్ స్ట్రాంగ్ విమెన్ అని కితాబిస్తుంటారు. కానీ తాను బలమైన మహిళను అని అనుకోవం లేదని సమంత అంటోంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సామ్.. చైతూతో విడాకులు.. ఆ తర్వాత ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎదురైన ట్రోల్స్ గురించి ఆ ఇంటర్వ్యూలో సమంతకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన సమంత.. ఆ సమయంలో తాను తన మనసుకు నచ్చినట్లుగా రియాక్టయ్యానని చెప్పింది. అప్పుడు తనకు మద్దతుగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. స్వతంత్ర భావాలు కలిగిన స్ట్రాంగ్ విమెన్‌ అని అందరూ నన్ను చూసి అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోవట్లేదు. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశా. కన్నీళ్లను, బాధలను చూశా. ఒకానొక సమయంలో అసలు నాకు మంచి జరుగుతుందా? అనే సందేహం వచ్చేది. ఇదే విషయాన్ని రోజూ మా అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. క్లి్ష్టమైన పరిస్థితుల్లో చీకటి రోజుల్లో బతికా. ఆ టైమ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తుండేవి. అయితే ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నా. అందుకే ముందడుగు వేశా. ఆ సమయంలో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా నా వెంటే ఉన్నారు. వాళ్ల వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నా. అయితే ఆ బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ ముందుతో పోలిస్తే చీకటి రోజులు చాలా తగ్గాయని నమ్ముతున్నా అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Kajal Aggarwal | బాలీవుడ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పిన టాలీవుడ్ చందమామ కాజల్

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Sai Pallavi | మేకప్ ఎందుకు వేసుకోదో అసలు సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి

Exit mobile version