Home Latest News Bandi Sanjay | పులి వేట మొదలుపెట్టింది.. తెలంగాణ ప్రజల కోసం చేవెళ్ల గడ్డ మీద...

Bandi Sanjay | పులి వేట మొదలుపెట్టింది.. తెలంగాణ ప్రజల కోసం చేవెళ్ల గడ్డ మీద అడుగుపెట్టింది.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమోషన్

Bandi Sanjay | సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నాయకులు వస్తుంటే.. కేసీఆర్ అభివృద్ది నిరోధకంగా మారిండని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్లమెంట్ యోజనలో భాగంగా వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు తనను అర్ధరాత్రి అరెస్టు చేసి 8 గంటల పాటు రోడ్లపై తిప్పారని బండి సంజయ్ గుర్తు చేశారు. రాత్రి ఇంట్లో నుంచి తనను ఎత్తుకుపోయిండ్రు అని అన్నారు. ” కరీంనగర్ దాటిన తర్వాత నా భార్య ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. నన్ను కొత్తపల్లి తీసుకుపోతున్నరు. సిద్దిపేట తీసుకుపోతున్నరు. గజ్వేల్ తీసుకుపోతున్నరు. యాదగిరిగుట్ట తీసుకుపోతున్నరు. ఏడికి తీసుకుపోతున్నరో అర్థం కావట్లేదు. కొంచెం దూరం పోయిన తర్వాత కానిస్టేబుళ్లు వచ్చిండ్రు. ఏమైతుందో తెలుస్తలేదు అన్న అని బాధపడ్డరు. అప్పుడు భయపడకండి అని వాళ్లకు చెప్పిన. ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసింది. పులి వేట ప్రారంభించింది. వెంటాడటం ప్రారంభించింది అని చెప్పిన” అని ఆనాటి సందర్బాన్ని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలను కాపాడే ఆ పులే ఇప్పుడు చేవెళ్ల గడ్డ మీద అడుగుపెట్టిందని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నాయకులు తెలంగాణకు వస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే తపనతో వస్తుంటే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకంగా మారిండని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారిండని గుర్తుపెట్టుకుని.. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని రకాలుగా దివాళా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటామని తెలిపారు. నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని.. నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. ఫస్ట్ నాడే జీతాలు ఇస్తామని హామి ఇచ్చారు.. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. ఈ రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను , నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి.. తెలంగాణలో రామరాజ్య స్థాపనకు అమిత్ షా నేతృత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. కలిసికట్టుగా వస్తున్న మమ్మల్ని ఆదరించండి. ఆశీర్వదించండని కోరారు. ” జైళ్లకు భయపడం. పోలీసులకు భయడపం. పోలీస్ కేసులకు భయపడం. లాఠీ దెబ్బలకు భయపడం. రామరాజ్య స్థాపించేవరకు అమిత్ షా నేతృత్వంలో కష్టపడి ముందుకు సాగుతాం.” స్పష్టం చేశారు.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Amit Shah | తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah | ప్రధాని అవ్వడం కాదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో.. కేసీఆర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా విమర్శలు

Exit mobile version